Adivi Sesh - Major Pre Release Theatrical Business | అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఈ సినిమాను చివరకు మరికొన్ని గంటల్లో (జూన్ 3)న ఈ సినిమ ా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్ర యూనిట్. ఇప్పటికే ట్రైలర్‌తో పాటు పలు పాటలు విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక అది అలా ఉంటే ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలఅవుతోంది. 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలవుతోంది. ఇక మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాళీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు.
ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో రూ. 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 147 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్ కి, 177 రూపాయలు ఉండనున్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో
తెలంగాణ (నైజాం) : రూ. 3.50 కోట్లు.. రాయలసీమ (సీడెడ్) - రూ. 2 కోట్లు ఆంధ్ర - రూ. 4.50 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ : రూ. 10 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ భారత్: రూ. 1 కోటి ఓవర్సీస్ - రూ. 2 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర రూ. 14 కోట్లు వసూళు చేయాలి.
ఇక మేజర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు (2 గంటల 28 నిమిషాలు) ఫిక్స్ చేశారు.
Telangana Directors in Tollywood : తెలుగు వెండితెరపై సత్తా చూపెడుతున్న తెలంగాణ దర్శకులు వీళ్లే..
ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. తాజాగా ఈ సినిమాను 10 రోజుల ముందుగా 9 మేజర్ నగరాల్లో ప్రీ రిలీజ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ సినిమాను ముందుగానే ప్రదర్శిస్తున్నారు. అన్ని ఏరియాల్లో ఒక్కసారి కాకుండా.. ఒక్కో నగరంలో ఒక్కో రోజు స్పెషల్ ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ దేశం కోసం ఎలా ప్రాణ త్యాగం వంటివి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే అంశాలని చెబుతున్నారు.ఇక NSG కమెండోల కోసం ఈ సినిమా స్పెషల్ వేస్తే.. NSG వాళ్లు చిత్ర యూనిట్‌కు NSG కి సంబంధించిన మెడల్ హీరోకు ప్రధానం చేయడం విశేషం. ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మహేష్ బాబు కౌంటర్‌లో టికెట్ తీసుకోవడం వంటివి చేశారు. ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Major film, Tollywood