Home /News /movies /

ADIVI SESH MAJOR MOVIE AGAIN POSTPONED NEW RELEASE DATE ANNOUNCED JUNE 3RD RELEASE WORLD WIDE TA

Adivi Sesh - Major : మరోసారి వాయిదా పడ్డ అడివి శేష్ ‘మేజర్’.. కొత్త విడుదల తేది ఇదే..

మేజర్ మూవీ మరోసారి వాయిదా (Twitter/Photo)

మేజర్ మూవీ మరోసారి వాయిదా (Twitter/Photo)

Adivi Sesh - Major:  అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇప్పటికే పలు రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా తాజాగా మరోసారి వాయిదా పడింది.

ఇంకా చదవండి ...
    Adivi Sesh - Major:  అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ రూపంలో దేశ వ్యాప్తంగా ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోన్న ఆ సమయంలో ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గడంతో ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య’సినిమాలు తమ సినిమాల కొత్త విడుదల తేదిలు ప్రకటించాయి. ఈ కోవలోనే అడివి శేష్ నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 27న విడుదల  కానున్నట్టు ప్రకటించారు.

    తాజాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ  చిత్రాన్ని తాజాగా జూన్ 3న ఒక వారం గ్యాప్ తర్వాత విడుదల చేస్తున్నారు. మే 27న ఈ సినిమాతో పాటు ఎఫ్ 3 మూవీ పోటీలో ఉండటం... ఈ  సినిమా పూర్తి స్థాయి హిల్లేరియస్ కామెడీతో వస్తోంది. దీంతో తన సినిమాను ఒక వారం రోజుల తర్వాత విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సోలో రిలీజ్ ‘మేజర్’ మూవీకి కలిసొచ్చే అంశాలు.

    జూన్ 3న అడివి శేష్ మేజర్ మూవీ విడుదల (File/Photo)


    ’మేజర్`(Major) సినిమా విషయానికి వస్తే.. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేజర్ సినిమాను `గూఢచారి` ఫేమ్ శశి కిరణ్ తిక్కా తెరకెక్కించారు.సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగుతో పాటు హిందీ,మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో  తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు.

    Rajamouli - Boyapati Sreenu: ఇప్పటికీ బోయపాటి శ్రీను‌ ఆ రికార్డును బీట్ చేయలేకపోతున్న రాజమౌళి..

    ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. అంతేకాదు ‘మేజర్’ మూవీని తెలుగు, హిందీతో పాటు మలయాళంలో మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు.

    RRR : ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అద్భుతమైన రికార్డు.. బాహుబలి 2 తర్వాత ఆ రికార్డు RRR దక్కింది..

    మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. మరోవైపు అడివి శేష్.. ‘గూఢచారి’ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.దే..
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Adivi Sesh, Major film, Tollywood

    తదుపరి వార్తలు