హోమ్ /వార్తలు /సినిమా /

Major 4 days Collections: ప్రపంచవ్యాప్తంగా నిజమైన భారతీయ హీరో సత్తా..

Major 4 days Collections: ప్రపంచవ్యాప్తంగా నిజమైన భారతీయ హీరో సత్తా..

Photo Twitter

Photo Twitter

Major Collections: మేజర్ సినిమా విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో తొలి రోజు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండో రోజు, మూడో రోజుతో పాటు నాలుగో రోజు కూడా బాక్సాఫీస్ దాడి చేసింది (Major Collections). మరి ఈ మేజర్ ఈ నాలుగు రోజుల్లో ఏయే ఏరియాల్లో ఎంతెంత రాబట్టాడో చూద్దామా..

ఇంకా చదవండి ...

యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్‌ పోషిస్తూ మేజర్ (Major) రూపంలో ఓ సందేశాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుంచారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా నటించగా.. శోబిత ధూళిపాళ (Sobhita Dhulipala), ప్రకాష్ రాజ్ (Prakash raj), రేవతి (Revathi) తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబడిన ఈ చిత్రం నిజమైన భారతీయ హీరో అయిన మేజర్ ఉన్నికృష్ణన్ సాహసాలను కాళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. దీంతో అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్ల ప్రవాహం పారుతోంది.

విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటిరోజు 4.07Cr రాబట్టిన ఈ సినిమా రెండో రోజుకు గాను 3.61Cr కోట్లు, మూడో రోజుకు గాను 3.57Cr అదేవిధంగా నిన్న (నాలుగో రోజు) 1.34Cr కోట్లు రాబట్టింది. మొత్తంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో కలిపి AP-TG టోటల్ కలెక్షన్స్ 12.59CR నెట్ (21.10CR గ్రాస్)గా నమోదయ్యాయి.

నాలుగో రోజు ఏరియాల వారిగా రిపోర్ట్..

Nizam: 71L

Ceeded: 14L

UA: 15L

East: 10L

West: 6L

Guntur: 7L

Krishna: 7L

Nellore: 4L

AP-TG టోటల్: 1.34CR నెట్(2.30CR గ్రాస్)

KA+ROI:- 1.35Cr

Hindi+ Other languages – 2.70Cr

OS: 4.90Cr

టోటల్ WW: 21.54CR నెట్ (39.50CR గ్రాస్)

మరోవైపు విదేశాల్లోనూ మేజర్ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడి సిల్వర్ స్క్రీన్ పై నిజమైన భారతీయ హీరోని తెగ మురిసిపోతున్నారు ఆడియన్స్. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో ఈ మూవీ విడుదలైంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ (Major Pre Release Business) చేసుకున్న ఈ మేజర్ సినిమా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ (Major Break even Point) పెట్టుకొని బరిలోకి దిగింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ చూస్తే 21.54CR నెట్ వసూలైంది అంటే ఇప్పటికే మేజర్ లాభాల బాటలో అడుగుపెట్టి దూసుకుపోతున్నాడన్నమాట. చూస్తుంటే ఈ వారం కూడా థియేటర్ల వద్ద మేజర్ హవా కనిపించే అవకాశాలే ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Adivi Sesh, Major Movie, Tollywood

ఉత్తమ కథలు