హోమ్ /వార్తలు /సినిమా /

Major 3 Days Collections: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు.. మొత్తానికి హ్యాపీ వీకెండ్

Major 3 Days Collections: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు.. మొత్తానికి హ్యాపీ వీకెండ్

Photo twitter

Photo twitter

Major Collections: మేజర్ సినిమా విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో తొలి రోజు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండో రోజుతో పాటు మూడో రోజు కూడా అదే రేంజ్‌లో బాక్సాఫీస్ దాడి చేసింది (Major Collections). మరి ఈ మేజర్ మొదటి మూడు రోజుల్లో ఏయే ఏరియాల్లో ఎంతెంత రాబట్టాడో చూద్దామా..

ఇంకా చదవండి ...

యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్‌లో విడుదలైన సినిమా ‘మేజర్’ (Major). ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో తొలి రోజు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండో రోజుతో పాటు మూడో రోజు కూడా అదే రేంజ్‌లో బాక్సాఫీస్ దాడి చేసింది (Major Collections). మరి ఈ మేజర్ మొదటి మూడు రోజుల్లో ఏయే ఏరియాల్లో ఎంతెంత రాబట్టాడో చూద్దామా..

మేజర్ AP TG డే వైజ్ కలెక్షన్స్

డే 1: 4.07Cr

డే 2: 3.61Cr

డే 3: 3.57Cr

ఈ మూడు రోజుల్లో కలిపి AP-TG టోటల్: 11.25CR నెట్ (18.80CR గ్రాస్)

మూడో రోజు ఏరియాల వారిగా రిపోర్ట్..

Nizam: 1.64Cr

Ceeded: 41L

UA: 44L

East: 30L

West: 19L

Guntur: 23L

Krishna: 21L

Nellore: 15L

AP-TG Total:- 3.57CR నెట్ (5.90CR~ గ్రాస్)

KA+ROI:- 1.25Cr

Hindi+ Other languages – 2.15Cr

OS: 4.70Cr

Total WW: 19.35CR నెట్ (35.80CR~ గ్రాస్)


ఇండియాతో పాటు అమెరికాలో కూడా భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది మేజర్ సినిమా. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో ఈ మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఏకంగా 4 కోట్ల మార్క్‌ని అందుకున్న మేజర్.. మూడో రోజుకు వచ్చే సరికి 11 కోట్ల మార్క్ అందుకోవడం గమనార్హం.

ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13CR ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మేజర్ సినిమా 14 cr బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది. ఇప్పటివరకు వరల్డ్ వైడ్ చూస్తే 19.35CR నెట్ నెట్ వసూలైంది అంటే ఇప్పటికే మేజర్ లాభాల బాటలో అడుగుపెట్టి దూసుకుపోతున్నాడన్నమాట. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ వారం కూడా థియేటర్స్ వద్ద మేజర్ సునామీ నడుస్తుందని స్పష్టమవుతోంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Adivi Sesh, Major Movie, Tollywood

ఉత్తమ కథలు