ADIVI SESH MAJOR 2 DAYS WORLD WIDE COLLECTION REPORT HERE SLB
Major 2 Days Collections: థియేటర్స్ వద్ద అదే పరిస్థితి! బ్రేక్ ఈవెన్‌కి ఎంత దూరంలో ఉందంటే..
Photo Twitter
Major 2 Days Collection Report: అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మరి ఈ రెండు రోజుల్లో మేజర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..
యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘మేజర్’ (Major). ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క (Sashi Kiran Tikka) దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి షోతోనే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. దీంతో తొలి రోజు అన్ని ఏరియాల్లో కూడా కలెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్లో బాక్సాఫీస్ దాడి చేసింది (Major Collections). మరి ఈ మేజర్ రెండో రోజుకు గాను ఏయే ఏరియాల్లో ఎంతెంత రాబట్టాడో ఓ లుక్కేద్దామా..
మేజర్ AP TG డే వైజ్ కలెక్షన్స్
డే 1: 4.07Cr
డే 2: 3.61Cr
AP-TG టోటల్: 7.68CR నెట్ (12.90CR గ్రాస్)
రెండో రోజు ఏరియాల వారిగా రిపోర్ట్..
Nizam: 1.62Cr
Ceeded: 41L
UA: 47L
East: 31L
West: 20L
Guntur: 22L
Krishna: 22L
Nellore: 16L
AP-TG టోటల్ : 3.61CR నెట్ (6.05CR~ గ్రాస్)
KA+ROI: 0.55Cr
Hindi+ Other languages: 1.05Cr
OS: 4.20Cr
Total WW: 13.48CR నెట్(25.10CR~ గ్రాస్)
ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది మేజర్ సినిమా. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో ఈ మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు ఏకంగా 4 కోట్ల మార్క్‌ని అందుకున్న మేజర్.. రెండో రోజు కూడా అదే హవా నడిపించాడు.
మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ కనిపిస్తుండటం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకొని ఆడియన్స్‌ని ఎంకరేజ్ చేశారు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్‌లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్‌కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్‌కు ఖరారు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 13CR ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మేజర్ సినిమా 14 cr బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగింది. అయితే ఇప్పటివరకు 13.48CR నెట్ వసూలైంది కాబట్టి మరో 1.57Cr రాబడితే ఈ ఎనిమా క్లీన్ హిట్ అయినట్లే. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.