హోమ్ /వార్తలు /సినిమా /

Hit 2: అడివి శేష్ హిట్ 2 పై లేటెస్ట్ అప్ డేట్.. రిలీజ్‌కు టీజర్ రెడీ..!

Hit 2: అడివి శేష్ హిట్ 2 పై లేటెస్ట్ అప్ డేట్.. రిలీజ్‌కు టీజర్ రెడీ..!

Photo twitter

Photo twitter

హిట్ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్‌లో హీరోగా అడివి శేష్ నటిస్తున్నాడు. ఇందులో భాగంగా హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ పై అప్ డేట్ ఇచ్చేశాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హిట్: ది ఫస్ట్ కేస్ 2020, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణ సారథ్యంలో సైలేష్ కొలను తొలిసారిగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో విశ్వక్ సేన్, రుహానీ శర్మ, మురళీ శర్మ, భాను చందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఎలాంటి హడావుడి లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయింది.అయితే అప్పట్లో హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందని కూడా చెప్పారు.

అయితే హిట్ 2లో విశ్వక్ సేన్ కాకుండా.. అడవి శేష్ నటించనున్నారు. అయితే ‘హిట్2’ను జూలైలోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల అది కుదరడం లేదని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హిట్2 సినిమాపై అడవిశేష్ ట్విట్టర్ వేదికగా తాజా అప్డేట్ ఇచ్చాడు. మేజర్ సక్సెస్ తో ఇటీవలే పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యువ హీరో అడివిశేష్. త్వరలోనే హిట్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అయితే  తాజాగా ఈ సినిమా టీజర్ రఫ్ కట్ చూసిన శేష్ దాంతో ఫుల్ సాటిస్ఫై అయినట్టు తెలుస్తుంది. ఈ మేరకు అడివి శేష్ ట్వీట్ చేసాడు. ‘ ఇప్పుడే హిట్ 2 టీజర్ రఫ్ కట్ చూసాను..మై న్యూ అవతార్ ఈజ్ లోడింగ్ .. ’ అంటూ డైరెక్టర్ శైలేష్ కి, నిర్మాత నానికి శేష్ కృతజ్ఞతలు తెలిపారు. అంటే మరి కొన్ని రోజుల్లోనే హిట్ 2 టీజర్ ప్రేక్షకులను పలకరించబోతుందన్న మాట. ఇక హిట్ 2 సినిమాను డిసెంబర్ 2వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.

శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అడివిశేష్ లీడ్ హీరోగా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ మూవీస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తుండగా, నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.ఈ సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2 సినిమా కోసం అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

First published:

Tags: Adivi Sesh, Hero nani, Hit 2

ఉత్తమ కథలు