ADIVI SESH INTERESTING COMMENTS ON HIS EARLY CINE CAREER VIDEO GOES VIRAL SR
Adivi Sesh : అడివి శేష్‌కు అవమానం.. హీరో అని చెప్పి.. ఆ తర్వాత హీరోను..
Adivi Sesh, Mahesh Babu : Twitter
Adivi Sesh : సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగా అడివి శేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుూ తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని తెలిపారు. అయితే అందరూ సన్నీలియోన్ అంటూ టీజ్ చేయడంతో అడివి శేష్‌గా మార్చుకున్నానని తెలిపారు
Adivi Sesh : అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ఇక ఈ సినిమాను ముందుగా ఫిబ్రవరి 11న దేశ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు. ఓమైక్రాన్ కారణంగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా కేసులు తగ్గడంతో ‘రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’, ఆచార్య’సినిమాలు తమ సినిమాల కొత్త విడుదల తేదిలు ప్రకటించాయి. ఈ కోవలోనే అడివి శేష్ (Adivi Sesh) నటించిన ‘మేజర్’ మూవీ కూడా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ సినిమాను మే 27న విడుదల కానున్నట్టు ప్రకటించారు. కాగా మరోసారి మరోసారి వాయిదా పడింది. ఇక చివరిసారిగా ఈ చిత్రాన్ని జూన్ 3న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ (Major Trailer) విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ట్రైలర్ ఓ రేంజ్లో ఉందని చెప్పోచ్చు.. మంచి ఏమోషన్స్‌తో కేక పెట్టిస్తుందని అంటున్నారు నెటిజన్స్.
సినిమా విడుదల దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. అందులో భాగంగా అడివి శేష్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుూ తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని తెలిపారు. అయితే అందరూ సన్నీలియోన్ అంటూ టీజ్ చేయడంతో అడివి శేష్‌గా మార్చుకున్నానని తెలిపారు. ఇక తన కెరీర్ విషయంలో జరిగిన ఓ ఘటన గురించి చెబుతూ.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చందమామ’ సినిమాలో నవదీప్ రోల్లో ముందుగా తనను తీసుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఓ రెండు రోజుల పాటు షూటింగ్ జరగిందని తెలిపారు. అయితే ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయిందని.. ఇక నా స్థానంలో నవదీప్ వచ్చారని తెలిపారు శేష్. ఇంకో ఘటన గురించి చెబుతూ.. ‘సొంతం’ సినిమాలో పెద్ద రోల్ ఉందని చెప్పారని.. ఆ తర్వాత ఐదు సెకన్లు మాత్రమే కనిపించానని తెలిపారు.
ఇక మేజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించనున్నారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాలో అడివి శేష్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ కనిపించారు. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఇటు తెలుగుతో పాటు హిందీ, మలయాళం వంటి మూడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు. అంతేకాదు ఈ సినిమాను దేశ వ్యాప్తంగా 75 లొకేషన్స్‌లలో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. కాగా ఈ సీక్వెల్లో విశ్వక్ సేన్ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.