Adivi Sesh | Hit2 : అడివి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లో టీజర్ (Hit 2 Teaser) విడుదల ప్రకటన వచ్చింది. అందులో భాగంగా ఈ మూవీ టీజర్ అనౌన్స్ మెంట్ వీడీయోని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. హిట్ ఫస్ట్ కేస్‌లో విశ్వక్ ని తీసుకుని ఈ సెకండ్ కేస్ లో అడివి శేష్‌ను హీరోగా తీసుకోవడానికి కారణం చెప్పారు. అది సెపరేట్ కేసు.. ఇది సెపరేట్ కేసు.. దీంతో ఈ సారి ఈ కేసులో అడివి శేష్, కృష్ణదేవ్ అలియాస్ కేడిగా కనిపిస్తారని చెప్పారు.
ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని అన్నారు. ఈ హిట్ 2 టీజర్‌ని నవంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది.
Director @KolanuSailesh walks us through the riveting world of #HIT ???? Watch HIT Verse now! - https://t.co/sg5U1cuaaG#HIT2 Teaser on November 3rd ???? #HIT2onDec2@adivisesh @nameisnani @garrybh1988 @maniDop @Meenakshiioffl#JohnStewartEduri #ManishaADutt
— Prashanti Tipirneni (@tprashantii) October 31, 2022
ఇక అడివి శేష్ సినిమా మేజర్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Hit 2, Tollywood news