హోమ్ /వార్తలు /సినిమా /

HIT 2 Movie Review: అడివి శేష్ ‘హిట్ 2’ మూవీ రివ్యూ.. రొటిన్ సైకో క్రైమ్ థ్రిల్లర్..

HIT 2 Movie Review: అడివి శేష్ ‘హిట్ 2’ మూవీ రివ్యూ.. రొటిన్ సైకో క్రైమ్ థ్రిల్లర్..

హిట్ 2 మూవీ రివ్యూ (HIT2 Twitter Review Photo : Twitter)

హిట్ 2 మూవీ రివ్యూ (HIT2 Twitter Review Photo : Twitter)

HIT 2 Movie Review: మేజర్ మూవీ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ 1లో విశ్వ‌క్‌సేన్ హీరోగా నటించారు. తాజాగా విడుదలైన హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : హిట్ 2 ..ది సెకండ్ కేస్ (HIT 2)

నటీనటులు : అడివి శేష్, మీనాక్షి చౌదరి, సుహాస్, పోసాని కృష్ణమురళి,రావు రమేష్, తనికెళ్ల భరణి, తదితరులు..

ఎడిటర్: గ్యారీ BH

సినిమాటోగ్రఫీ: S. మణికందన్

సంగీతం: M.M.శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి

నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని, నాని సమర్పణ

దర్శకత్వం: శైలేష్ కొలను

విడుదల తేది : 2/12/2022

మేజర్ మూవీ తర్వాత అడివి శేష్ హీరోగా నటించిన మూవీ హిట్ 2. ఇది విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ’హిట్‌’ మూవీకి సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తాజాగా విడుదలైన హిట్ 2లో అడివి శేష్ హీరోగా నటించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

విశాఖ పట్నంలో ఓ యువతి దారుణ హత్యకు గురవుతోంది. ఈ హత్య కేసును చేధించడానికి వైజాగ్ SP కృష్ణ దేవ్ రంగంలోకి దిగుతాడు. ఈ నేపథ్యంలో హత్యకు గురైంది ఒక అమ్మాయి కాదు.. ముగ్గురు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో  తెలుస్తోంది. ఆ తర్వాత SPకృష్ణ దేవ్ ఈ హత్యలు చేస్తోంది ఓ సైకో అని తెలుసుకుంటాడు. ఈ క్రమంలో  హత్యలను చేస్తోన్న ఈ సైకో కిల్లర్‌ను చివరకు హీరో ఎలా పట్టుకుని ఈ కేసును సాల్వ్ చేసాడనేదే  ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు శైలేజ్ కొలను ఈ సినిమాను సమాజంలో జరుగుతున్న క్రైమ్ మర్ధర్ స్టోరీలతో పాటు దర్శకుడు గౌతమ్ మీనన్ తాలూకు ప్రభావం ఉన్నట్టు ఈ సినిమాను చూస్తే తెలుస్తోంది. అటు రాక్షసుడు మూవీ ఛాయలు కూడా కనిపిస్తాయి.  హిట్ 2 లాంటి కథలను మన ప్రేక్షకులకు ఎపుడో  సీఐడీ వంటి సీరియల్స్‌లో కూడా చూసేసారు. దాంతో పాటు ఎన్నో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఇలాంటి  కాన్సెప్ట్‌తో ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దర్శకుడు రొటీన్ క్రైమ్ మర్డర్ మిస్టరీని తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మధ్యలో హీరో, హీరోయిన్ మధ్య పెళ్లికి ముందే  డేటింగ్, రొమాన్స్ అనేవి ఇప్పటి యూత్ ఎలా ఆలోచిస్తున్నారనేది ఈ సినిమాలో చూపించారు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్  పంటి కింద రాయిలా అనిపించినా.. వీరి లవ్, ఎమోషన్‌ను తర్వాత కథలో ఇన్వాల్వ్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నాడు.

సినిమా ప్రారంభంలో హీరో, హీరోయిన్ మధ్య  ఓ పాటను మాత్రమే ఈ సినిమాలో పెట్టాడు. మిగతా సినిమాను సీరియస్ కథనంతో పట్టు సడలకుండా చూసుకున్నాడు. ఈ మూవీని క్లైమాక్స్‌ను రొటిన్‌గా కాకుండా ఇంకాస్తా మెరుగ్గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. మాములుగా మనం ఇలాంటి కథలను ఎన్నో చూసాము. ఒక వ్యక్తి ఎందుకు సైకోగా మారాడు. అతని చుట్టు ఉండే మనుషులే అతన్ని సైకోలా మారుస్తాయనే విషయాన్ని అందరి లాగే చూపించాడు. మొత్తంగా దర్శకుడు శైలేష్ కొలను కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేదనిపిస్తుంది. సైకో విలన్ పాత్రను ఇంకాస్తా మెరుగ్గా చూపించి ఉంటే బాగుండేది.  మధ్యలో క్రైమ్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌తో కూచొని చూసేలా లేవు.  ఓన్లీ యూత్.. ఓ వర్గం ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు.  మధ్యలో లాజిక్ లేని సన్నివేశాలు ఉన్న.. ఓవరాల్‌గా బాగుంది.

మిగతా టెక్నీషియన్స్ విషయానికొస్తే..  ఈ సినిమాకు శ్రీలేఖ, సురేష్ బొబ్బలి అందించిన ఆర్ఆర్‌తో పాటు మ్యూజిక్ పర్వాలేదనిపిస్తోంది. ఎడిటర్ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఈ సినిమాను చాలా చక్కగా ట్రిమ్ చేసాడు. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు విషయానికొస్తే.. 

అడివి శేష్.. SP కృష్ణ దేవ్ పాత్రలో పర్వాలేదనిపించాడు. పోలీస్ ఆఫీసర్‌గా ఇంకాస్త రఫ్‌గా ఈ పాత్రను చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా అడివి శేష్.. మాస్ సినిమా చేసినా అతనిలో ఉన్న క్లాస్ ఛాయలు పోలేదు. ఈ సినిమాలో పాత్రను తాను మాత్రమే చేయగలనే రీతిలో నటించి ఉంటే బాగుండేది. ఏదో సో.. సో..గా తనకు వచ్చిన పోలీస్ పాత్రను ఏదో చేసుకుంటూ వెళ్లినట్టు కనబడుతోంది. పోలీస్ ఆఫీసర్‌గా ఇంకాస్తా ఇంప్రెసివ్‌గా చేసి ఉంటే బాగుండేది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన మార్క్ చూపించ లేకపోయాడు.  మేజర్ సినిమాలో మేజర్ సందీప్ కృష్ణన్ పాత్రలో అద్భుతంగా నటించిన ఈతను .. కృష్ణదేవ్ పాత్రలో ఓ పరిధి మేరకు మాత్రమే ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరి.. నటన బాగుంది. హోమ్లీగా  బాగానే నటించింది. మిగతా పాత్రల్లో నటించిన రావు రమేష్, తనికెళ్ల భరణి, సుహాస్ తన పరిధి మేరకు బాగానే నటించారు. చివర్లో నాని సడెన్ ఎంట్రీ అదిరిపోయింది. అర్జున్ సర్కార్‌గా హిట్ 2 మూవీలో తానే హీరో అన్నట్టు దర్శకుడు చూపించాడు.

ప్లస్ పాయింట్స్.. 

కథనం,

ఎడిటింగ్

స్లో నేరేషన్

మైనస్ పాయింట్స్ 

రొటిన్ కథ

ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడటం కష్టమే

క్లైమాక్స్

చివరి మాట : రొటిన్ సైకో క్రైమ్ థ్రిల్లర్.. ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే..

రేటింగ్ : 2.75/5

First published:

Tags: Adivi Sesh, Hit 2, Tollywood

ఉత్తమ కథలు