Adivi Sesh | Hit2 : అడివి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్లో శేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది. ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకుంటోన్న హిట్ 2 మూవీ ప్రిరీలిజ్ ఈవెంట్ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ (Hit 2 Movie pre release event) ఈవెంట్‌ని నవంబర్ 28న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రిరీలిజ్ ఈవెంట్‌కు ఆర్ ఆర్ ఆర్ దర్శకుడు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. ఈ విషయంలో టీమ్ అధికారిక ప్రకటన చేసింది. ఇక మొన్నటి దాకా అమెరికాలో రాజమౌళి తన సినిమా ఆర్ ఆర్ ఆర్ ఫర్ ఆస్కార్ అంటూ ప్రమోషన్స్ నిర్వహించారు. కొన్నాళ్ల తర్వాత రాజమౌళి వస్తున్న ఓ పబ్లిక్ ఈవెంట్ ఇదే అని అంటున్నారు.
ఇక హిట్ 2 సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిందని చెప్పోచ్చు. అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో ట్రైలర్ కేక పెట్టిస్తోంది. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
The pride of India and ace director @ssrajamouli Garu would be gracing the Grand Pre Release Event of #HIT2 on November 28th and making it extra special.#HIT2onDec2 @AdiviSesh @NameisNani @KolanuSailesh @tprashantii @Meenakshiioffl @saregamasouth pic.twitter.com/iBMLTWz2YI
— Wall Poster Cinema (@walpostercinema) November 26, 2022
ఇక ఈ సినిమా నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ ఉరికే.. ఉరికే.. (Urike Urike song) ఇటీవల విడుదలైంది. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు శ్రీలేఖ సంగీతం అందించారు. కృష్ణకాంత్ మంచి ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్, రమ్య పాడారు.. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.
The Strength behind #HIT2 And the encouragement behind the Rampage. Thank you big bro @NameisNani https://t.co/5tL6mceNO8 https://t.co/RO2IobLp1h
— Adivi Sesh (@AdiviSesh) November 23, 2022
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshii Chaudhary) హీరోయిన్గా చేస్తోంది. సంగీతం ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. శేష్ ఈ సినిమా మొదటగా పెద్దగా పట్టింపు లేని ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఈ టీజర్లో రావు రమేష్, ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరిలు కనిపించారు.
ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు.. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించనుంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది.
ఇక అడివి శేష్ సినిమా మేజర్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్టైన్మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adivi Sesh, Hit 2, Tollywood news