హోమ్ /వార్తలు /సినిమా /

Adivi Sesh - Hit 2: అడివి శేష్ ‘హిట్ 2’ మూవీకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్.. రన్ టైమ్ ఎంతంటే..

Adivi Sesh - Hit 2: అడివి శేష్ ‘హిట్ 2’ మూవీకి ‘A’ సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ బోర్డ్.. రన్ టైమ్ ఎంతంటే..

హిట్ 2 మూవీ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

హిట్ 2 మూవీ సెన్సార్ పూర్తి (Twitter/Photo)

Adivi Sesh | Hit 2 : మేజర్ సినమా తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీలో హిట్ 2. ఇది హిట్‌కు సీక్వెల్‌గా వస్తోంది. హిట్ 1లో విశ్వ‌క్‌సేన్ హీరోగా నటించారు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Adivi Sesh - Hit2 : అడివి శేష్ (Adivi Sesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డ.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే కథలు  రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ,  మలయాళీ భాషల్లో విడుదలై మంచి లాభాలను తెచ్చింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించారు. మొదటి ‘హిట్’ సినిమా కేస్ 1లో  విశ్వక్ సేన్ నటించగా.. సీక్వెల్‌లో శేష్ నటించాడు.  మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది. ట్రైలర్, టీజర్స్‌తో ఆకట్టుకుంటోన్న హిట్ 2 మూవీ ప్రిరీలిజ్ ఈవెంట్  ఈ నెల నవంబర్ 28న హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయంలో టీమ్ అధికారిక ప్రకటన చేసింది.

ఇక  ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిందని చెప్పోచ్చు. అదిరిపోయే ఇన్వెస్టిగేషన్ సీన్స్‌తో ట్రైలర్ కేక పెట్టిస్తోంది. హీరో ఎలా విలన్ రూపంలో తనకు ఎదురయ్యే ఛాలెంజ్‌ను చేధించాడు అనేది థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. దీనికి తోడు సౌండ్, పిశ్చర్ అదిరిపోయింది. సినిమా హిట్ అని అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. తాజాగా ఈసినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు ‘A’ సర్ఠిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ కూడా 2 గంటలు మాత్రమే. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రన్ టైమ్‌లో విడుదల కాబోతున్న చిత్రం ఇదే కావడం విశేషం.

ఇక ఈ సినిమా నుంచి  రొమాంటిక్ వీడియో సాంగ్ ఉరికే.. ఉరికే.. (Urike Urike song) ఇటీవల విడుదలైంది. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు శ్రీలేఖ సంగీతం అందించారు. కృష్ణకాంత్  ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సిద్ శ్రీరామ్, రమ్య పాడారు.. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

సంగీతం ఎంఎం శ్రీ లేఖ, సురేష్ బొబ్బిలి అందిస్తున్నారు. హిట్ 2 సినిమాలో శేష్ ఈ సినిమా మొదటగా పెద్దగా పట్టింపు లేని ఆఫీసర్‌‌గా కనిపిస్తున్నారు. అయితే ఓ ఛాలెంజింగ్ కేస్ దొరికితే ఎలా ఉంటుంది.. అప్పుడు కృష్ణదాస్ నటిస్తున్న శేష్‌గా ఎలా ఆ కేసును సాల్వ్ చేశారు అనేది సినిమా. ఈ టీజర్‌లో రావు రమేష్, ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి‌లు కనిపించారు. ఇక ఈ సెకండ్ పార్ట్‌లో మరింతగా యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని అంటున్నారు దర్శకుడు.. ఈ మూవీని ప్రశాంతి త్రిపురనేని, హీరో నానిలు కలిసి నిర్మిస్తున్నారు. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుంది.  హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించనుంది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది. మరి ఈ సినిమాతో అడివి శేష్ హిట్ అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరొకొన్ని రోజులు ఆగాల్సిందే.

First published:

Tags: Adivi Sesh, Hit 2, Meenakshi Chaudhary, Tollywood

ఉత్తమ కథలు