ప్రభాస్ ప్లేస్ కొట్టేసిన అడివి శేష్.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..

ప్రభాస్,అడివి శేష్ (ఫైల్ ఫోటో)

అవును అడివి శేష్.. ప్రభాస్ స్థానాన్ని ఆక్రమించాడు. అడివి శేష్ ఏంటి.. ప్రభాస్ స్థానాన్ని ఆక్రమించడం ఏంటి అనుకుంటున్నారా. ఏమి లేదు..

 • Share this:
  అవును అడివి శేష్.. ప్రభాస్ స్థానాన్ని ఆక్రమించాడు. అడివి శేష్ ఏంటి.. ప్రభాస్ స్థానాన్ని ఆక్రమించడం ఏంటి అనుకుంటున్నారా. ఏమి లేదు.. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ సినిమాను ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం  పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమాను ఆగష్టు 30కి పోస్ట్ పోన్ చేసారు. సరిగ్గా టైమ్ చేసుకొని అడివి శేష్..తను హీరోగా నటించిన ‘ఎవరు’ సినిమాను ఆగష్టు 15న  విడుదల చేస్తున్నాడు.

  ప్రభాస్ ప్లేస్ కొట్టేసిన అడివి శేష్.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్..
  ‘ఎవరు’ మూవీలో అడివి శేష్ (ఫైల్ ఫోటో)


  అడివి శేష్ విషయానికొస్తే.. ‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్  ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. అంతకు ముందు ‘పంజా’, ‘బాహుబలి’ వంటి సినిమాల్లో విలన్‌గా సత్తా చూపెట్టాడు. తాజాగా అడివి శేష్.. ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ యూనిట్.. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.  ఈ టీజర్ మొత్తం ఆకట్టుకునేలా ఉంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా ఒక హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆ కేసును చేధించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ నటించాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో రెజీనా, నవీన్ చంద్ర నటించారు. ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల కానుంది.  మరి ‘సాహో’ ప్లేస్‌లో తెలుగులో విడుదల కానున్న ఈ  మూవీతో అడివి శేష్..మరోసారి తెలుగు ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడా ? లేదా అనేది చూడాలి.

   
  First published: