అక్కడ అదరగొడుతోన్న అడివి శేష్ 'ఎవరు'...

Evaru on Amazon Prime : అడివి శేష్‌..  'క్షణం', 'గూఢచారి' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆయన తాజా సినిమా 'ఎవరు' కూడా ఆగస్ట్ 15న విడుదలై అదిరిపోయే ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్నీ కట్టి పడేసింది.

news18-telugu
Updated: September 16, 2019, 7:07 AM IST
అక్కడ అదరగొడుతోన్న అడివి శేష్ 'ఎవరు'...
Twitter/AdiviSesh
news18-telugu
Updated: September 16, 2019, 7:07 AM IST
అడివి శేష్‌..  'క్షణం', 'గూఢచారి' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆయన తాజా సినిమా 'ఎవరు' కూడా ఆగస్ట్ 15న విడుదలై అదిరిపోయే ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్నీ కట్టి పడేసింది. ఎంతలా అంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా సినిమాను ప్రశంసించారు. 'ఎవరు' సినిమా చూసి థ్రిల్ అయ్యానని.. గొప్ప స్క్రీన్‌ప్లేతో .. అద్భుతంగా సినిమాను ఎగ్జ్‌క్యూట్ చేశారు.. అంటూ మహేష్ ప్రశంసించారు. అల్లు అర్జున్ కూడా సినిమా అద్భుతంగా ఉందని.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ఉన్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారంటూ సినిమాను మెచ్చుకున్న విషయం తెలిసిందే.




అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఎవరు సినిమాను పీవీపీ సంస్థ నిర్మించగా వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం అయ్యాడు.  ఈ సినిమాలో అడివిశేష్‌తో పాటు రెజీనా కసాండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. సినిమాను ఇంతకుముందు చూసిన వారు మళ్లీ చూసి... వావ్ వాటే ఫిల్మ్ అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ పెడుతుంటే.. చూడని వారు అమెజాన్ ప్రైమ్‌లో చూసి.. ఊహించని మలుపులతో అదిరిపోయిందిగా అంటూ మెచ్చుకుంటున్నారు.
Loading...







First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...