హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న శంకర్ కూతురు అదితి శంకర్ (Twitter/Photo)
Aditi Shankar : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా శంకర్ కూతురు కథానాయకగా కోలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
Aditi Shankar : ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోల వారసులే కాదు. వారసురాళ్లు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఫ్యామిలీ నుంచి నిహారిక (Niharika) హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రాజశేఖర్ (Rajasekhar) కూతుళ్లు శివానీ(Shivani), శివాత్మిక (Shivatmika) హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు కన్నడ లెజండరీ నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మనవరాలు ధన్య రామ్‌కుమార్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అటు తమిళం నుంచి కమల్ హాసన్, అర్జున్, శరత్ కుమార్ కూతుళ్లు కూడా కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి తమ లక్‌ను పరీక్షించుకున్నారు. తాజాగా దక్షిణాది దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. కార్తి హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
‘విరుమన్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2 డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదితి శంకర్‌కు స్వాగతం.. మీరు అందరి హృదయాలను గెలుచుకుంటావని ఆశిస్తున్నాను. ఇక తన కూతురు అదితిని పరిచయం చేస్తోన్న సూర్య, కార్తి,జ్యోతికలకు శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిజేసారు.
శంకర్ విషయానికొస్తే.. తెలుగులో ఇప్పటి వరకు తన తమిళ డబ్బింగ్ సినిమాలతో పలకరించిన ఈయన తొలిసారి డైరెక్ట్‌గా రామ్ చరణ్‌తో నిర్మిస్తోన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 8న అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా రానున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.
అంతేకాదు బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. రామ్ చరణ్ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. మరోవైపు కమల్ హాసన్‌తో చేస్తోన్న ‘భారతీయుడు 2’ సినిమాను త్వరలో పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో శంకర్ మాట్లాడినట్టు సమాచారం. ఇప్పటికే ‘భారతీయుడు 2’ షూటింగ్ విషయమై ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం.
శంకర్ విషయానికొస్తే.. ఈయన విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభిచారు. ఆ తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ‘జెంటిల్ మేన్’ మూవీతో డైరెక్టర్‌గా మారారు. జెంటిల్ మేన్ అప్పటి వరకూ సౌత్ ఇండియా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. శంకర్ డైరెక్షన్ కు, యాక్షన్ కింగ్ అర్జున్ నటనతోపాటు.. రెహమాన్ మ్యూజిక్ కూడా తోడు కావడంతో.. జంటిల్మెన్ ఒక రేంజ్ హిట్ సాధించింది. ఆ తర్వాత దర్శకుడి శంకర్ వెనుదిరిగి చూసుకోలేదు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.