HOME »NEWS »MOVIE »aditi rao hydari about her movies and image in movie industry mhn

Aditi Rao Hydari: అదితి అలా అవ్వ‌డానికి కార‌ణం అత‌నే.... పేరు రివీల్ చేసిన బ్యూటీ!

Aditi Rao Hydari: అదితి అలా అవ్వ‌డానికి కార‌ణం అత‌నే.... పేరు రివీల్ చేసిన బ్యూటీ!
Aditi Rao Hydari about her movies and image in Movie industry

Aditi Rao Hydari : దక్షిణాది సహా ఉత్తరాది సినిమాల్లో పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పిస్తున్న హీరోయిన్ అదితిరావు హైదరి. ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ తన సినిమాల గురించి, ఇమేజ్ గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడింది

  • Share this:
    అదితీరావు హైద‌రీ ఇప్పుడు ఇలా ఉండ‌టానికి కార‌ణం ఎవ‌రో తెలుసా? రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేసింది అదితీరావు హైద‌రీ. అస‌లు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఎలా ఉంటుంది? ఎక్క‌డ ఎలాంటి సినిమాలు తీస్తారు? అనే నాలెడ్జ్ లేక‌ముందే అదితిరావు హైద‌రీ మ‌ణిర‌త్నం సినిమాల్లో న‌టించాల‌ని అనుకుంద‌ట‌. అయితే అది ఎలా సాధ్యం? ఏమిటి? అనే విష‌యాలు మాత్రం ఆమెకు క్లారిటీగా లేవ‌ట‌. స‌రిగ్గా అలాంటి స‌మ‌యంలోనే త‌మిళ సినిమా శృంగారంతో ఆమె సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా హిందీ సినిమాలు చేసింది. మ‌ళ్లీ మ‌ణిర‌త్నం సినిమాల‌తోనే సౌత్ ఎంట్రీ ఇచ్చింది.

    ఇప్పుడు తెలుగులోనూ అదితిరావు హైద‌రీ పేరు మారుమోగుతోంది. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలంటే ఆమె క‌చ్చితంగా గుర్తుకువ‌స్తుంది. మ‌ల‌యాళంలోనూ మంచి క‌థ‌లు ఆమెనే వెతుక్కుంటూ వెళ్తున్నాయి. దీని గురించి అదితిరావు హైద‌రీ మాట్లాడుతూ ``నాకు సినిమాల ప‌ట్ల క‌నీస అవ‌గాహ‌న లేని స‌మ‌యంలోనే నేను మ‌ణిర‌త్నం సినిమాలో న‌టించాల‌ని అనుకున్నాను. అలాంటిది ఆయ‌న‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నాను. త్వ‌ర‌లోనే త‌మిళ్‌లోనూ డ‌బ్బింగ్ చెప్పుకుంటాను. కానీ మల‌యాళంలో మాత్రం ఇప్పుడ‌ప్పుడే అలాంటి సాహ‌సాల‌ను చేయ‌గ‌ల‌న‌ని అనుకోవ‌డం లేదు. ఎందుకంటే ఆ భాష నాకు అర్థం కాదు, మాట్లాడ‌టం కూడా చాలా క‌ష్టం అని అర్థ‌మైపోయింది`` అని చెప్పింది.



    అంతే కాదు, త‌న‌కు వ‌చ్చిన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ గురించి మాట్లాడుతూ ``నేనేం చేసినా, అందులో 100 శాతం నా మార్కు ఉండేలా క‌ష్ట‌ప‌డ‌తాను. బౌండ‌రీస్ పుష్ చేయ‌డానికే ట్రై చేస్తాను. నేను చేసే ప‌నిలో ఎంత‌గా ఇన్వాల్వ్ అవుతాను అంటే, కొన్నిసార్లు నేను ఏ సిటీలో ఉన్నాన‌నే విష‌యాన్ని కూడా మ‌ర్చిపోతాను. నాకు కావ‌ల్సింది ప‌ని. ఆ ప‌నిలో ఉన్న‌ప్పుడు ఇంకేమీ గుర్తుకురావు. అయినా నేను ఈ ఇండ‌స్ట్రీలో నాకు న‌చ్చిన ప‌నిని హాయిగా చేసుకోవ‌డానికి కార‌ణం మ‌ణిర‌త్నం. ఆయ‌న సినిమాలు ఇచ్చిన ఇన్‌స్పిరేష‌న్‌. అందుకే నా విష‌యంలో అంతా ఆయ‌నే చేశారు`` అని న‌వ్వుతూ చెప్పింది అదితిరావు హైద‌రీ.
    Published by:Anil
    First published:January 17, 2021, 13:38 IST