Adithi Rao Hydari: లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు: అదితి రావు హైదరి

Adithi Rao Hydari

Adithi Rao Hydari: అమ్మాయిలకు తమ జీవితంలో ఏదో ఒక రూపంలో చేదు సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక కొందరు అమ్మాయిలు వాటికి ధైర్యంగా ఎదుర్కొని అడ్డు తిరుగుతుంటారు. మరికొందరు ఏమీ అనలేక లోలోపల

  • Share this:
    Adithi Rao Hydari: అమ్మాయిలకు తమ జీవితంలో ఏదో ఒక రూపంలో చేదు సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక కొందరు అమ్మాయిలు వాటికి ధైర్యంగా ఎదుర్కొని అడ్డు తిరుగుతుంటారు. మరికొందరు ఏమీ అనలేక లోలోపల కుమిలిపోతుంటారు. ఇప్పటికీ ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నా కూడా ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. వీటి వల్లే ఎంతోమంది అమ్మాయిల జీవితాలు నాశనమవుతున్నాయి. ఇటువంటి సంఘటనలను దరికి చేరకుండా ఎదుర్కోవాలని.. వాటి గురించి ఇంట్లో వాళ్ళు ఆడపిల్లలకు తెలపాలని బాలీవుడ్ నటి అదితి రావు హైదరి అంటుంది.

    తెలుగు రాష్ట్రానికి చెందిన తెలుగు అమ్మాయి అదితి రావు హైదరి. హైదరాబాద్ లో పుట్టిన ఈ తెలుగమ్మాయి నార్త్ లో ఎక్కువగా పెరిగింది. హిందీ సినిమాలలో ఎక్కువగా నటించింది. అంతేకాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సమ్మోహనం, అంతరిక్షం వంటి సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ సినిమా కంటే ముందు 2006లో మలయాళం సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

    తొలిసారి నటనకు మంచి ప్రశంసలు అందుకున్న అదితి.. ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. నాని, సుధీర్ కలిసి నటించిన 'వి' సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహాసముద్రం సినిమాలో నటిస్తుంది. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్నారు. అంతేకాకుండా 'హే సినామిక' అనే సినిమాలో కూడా నటిస్తుంది.

    ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి రావు తన చిన్నతనంలో ఎదురైనా ఓ చేదు సంఘటనను పంచుకుంది. తను స్కూల్ సమయంలో లోకల్ ట్రైన్ లో వెళ్తున్న సమయంలో ఓ పెద్దాయన తనను బ్యాడ్ గా టచ్ చేస్తూ వెళ్ళిబోయాడట. ఇక ఆ సమయంలో వెంటనే అతడిని ఆపి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకండి అంటూ వార్నింగ్ ఇచ్చిందట. అలా కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకున్నా అదితి.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఇంట్లో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకు తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం సమాజం గురించి వారికి అవగాహన కల్పించాలని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published: