తెలుగింటి బుల్లి తెరపై జబర్దస్త్, అదిరింది కామెడీ షోల మధ్య వార్ కొనసాగుతోంది. జబర్దస్త్‌కు పోటీగా నాగబాబు ఆధ్వర్యంలో వచ్చిన అదిరింది షో.. ఆ స్థాయిలో ఆకట్టుకోకున్నా, ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. టీఆర్పీ రేటింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లోనూ వ్యూస్ పెంచుకుంటోంది. ముఖ్యంగా పటాస్ ఫేమ్ సద్దాం ఎంట్రీ ఇచ్చాక ప్రేక్షకుల్లో అదిరింది షోకు ఆదరణ పెరిగింది. జబర్దస్త్ల ఆది పంచ్‌లు ఎలా వేస్తాడో.. అదిరిందిలో అంతకు మించిన స్థాయిలో పంచ్‌ల వర్షం కురిపిస్తాడు సద్దాం. మనోడి స్కిట్స్ యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ఐతే ఆదివారం ప్రసారమైన 'అదిరింది' షోలో సద్దాం వేసిన ఓ పంచ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హైపర్ ఆదిని ఉద్దేశించి సెటైర్ వేయడంతో.. ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది.
స్కిట్లో భాగంగా ఓ సందర్భంలో గల్లీ బాయ్స్ టీమ్మేట్ భాస్కర్.. ''అది కాదురా..'' అని సద్దాంతో అంటాడు. వెంటనే అందుకున్న సద్దాం.. ''ఆది కాకుంటే... సద్దాం. ట్రెండింగ్‌లో ఉంటుంది.'' అని జోకు పేల్చుతున్నాడు. దాంతో జడ్జిలు నాగబాబు, నవదీప్ పగలబడి నవ్వుతారు. ఐతే యూట్యూబ్‌లో హైపర్ ఆది స్కిట్స్ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఇటీవల సద్దాం స్కిట్స్ కూడా యూబ్యూట్‌లో దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరకంగా వ్యూస్ విషయంలో యూట్యూబ్‌లో ఇరువురూ పోటీపడుతున్నారు. అందుకే హైపర్ ఆదిని టార్గెట్ చేసి.. సద్దాం పంచ్ వేశాడని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తనతో పోటీపడాలంటూ సవాల్ విసిరాడని జబర్దస్త్, అదిరింది కామెడీ షో వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adirindi, Hyper Aadi, Jabardasth, Tollywood