Home /News /movies /

ADIPURUSH TEAM SAIF ALI KHAN PRABHAS AND KRITI SANON CLICKED AT OM RAUT HOUSE SB

Prabhas: రాత్రి నుంచి వెయిటింగ్.. ప్రభాస్ సార్ ప్లీజ్.. వీడియో వైరల్

ప్రభాస్

ప్రభాస్

బాలీవుడ్ డైరెక్టర్ ఇంటికి ప్రభాస్‌ వెళ్లాడు. పొద్దున్నే అతని ఇంటి దగ్గర ప్రభాస్ కనిపించడంతో ఫోటోగ్రాఫర్లు ప్రభాస్‌ను చుట్టుమట్టారు.

    ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి వెళ్లినా.. బెల్లం చూట్టూ ఈగలు చేరినట్లు.. ప్రభాస్‌ను అభిమానులు చుట్టుముట్టేస్తారు. తాజాగా ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఇంటికి వెళ్లాడు. ఆయన  పార్టీ ఇవ్వడంతో రాత్రంతా అక్కడే ఉన్నట్లు సమాచారం. అయితే పొద్దున్నే బయటకు రాగానే.. మీడియా ప్రభాస్‌ను చుట్టుముట్టింది. వెళ్లిపోతుంటే.. సార్ ఆగండి... రాత్రంతా ఇక్కడే వెయిట్ చేసాం.. ప్లీజ్ ప్లీజ్ అంటూ అతడ్ని రిక్వెస్ట్ చేసింది. దీంతో మీడియా, ఫోటో గ్రాఫర్లు అడగడంతో ప్రభాస్ కాసేపు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చాడు. తర్వాత అందరికీ బాయ్ చెబుతూ.. కారెక్కి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తతుం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



    వివరాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ తో చేసిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీతగా అలాగే స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రల్లో నటించారు.

    మరి ఇదిలా ఉండగా ఆది పురుష్ సినిమా టీమ్...  అంతా ఇప్పుడు దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో సందడి చేశారు. ఓం రౌత్ ఇంటి దగ్గర ఈ తెల్లవారు జామున కనిపించడం ఆసక్తిగా మారింది. అయితే వీరంతా ఇంత పొద్దున్నే ఎందుకు వచ్చారంటే ఓంరౌత్ తన ఇంటి వద్ద ఏదో పార్టీ ఇస్తున్నాడని అందుకే హాజరైనట్టు తెలుస్తుంది. అలాగే ఆదిపురుష్ కి సంబంధించి కూడా అవ్వొచ్చని ఇంట్రెస్టింగ్ టాక్ ఉంది.



    దీనితో వీరి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ స్టార్లంతా బయటకు రావడంతో అప్పటికే అక్కడే పడిగాపులు కాస్తున్న మీడియా ప్రతినిధులు. పోటో గ్రాఫర్లు వారిని అడ్డుకున్నారు. ఫోటోలు దిగాలంటూ.. కోరారు. దీంతో కాసేపు ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ.. ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Adipurush movie, Om Raut, Prabhas, Saif Ali Khan

    తదుపరి వార్తలు