హోమ్ /వార్తలు /సినిమా /

Adipurush: బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన టీమ్.. అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌!!

Adipurush: బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన టీమ్.. అయోమయంలో ప్రభాస్ ఫ్యాన్స్‌!!

Photo Twitter

Photo Twitter

Adipurush update: ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు ప్రభాస్. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి నెలలు గడుతున్నా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు. దీంతో అభిమానులను ఖుషీ చేసేలా ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందట ఆదిపురుష్ టీమ్.

ఇంకా చదవండి ...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన తదుపరి సినిమాలతో ఆ లోటు భర్తీ చేసి రెబల్ స్టార్ (Rebal Star) అభిమానులను హుషారెత్తించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బిగ్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో ఆదిపురుష్ (Adipurush) సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి నెలలు గడుతున్నా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు. దీంతో అభిమానులను ఖుషీ చేసేలా ఓ బిగ్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందట ఆదిపురుష్ టీమ్.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ వైరల్ అవుతోంది. అభిమానుల ఎదురుచూపులు ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే అది ఇప్పుడు మాత్రం కాదు.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వదలాలని చూస్తున్నారట. ఇక అప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా వేగవంతం చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ అనే మాట విని ప్రభాస్ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నప్పటికీ అందుకోసం మరో 5 నెలలు వేచి చూడాలా అంటూ కాస్త నిరాశ పడుతూ అయోమయంలో పడిపోయారు. ఏదేమైనా పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఇంత సమయం తీసుకుంటున్నారంటే ఆదిపురుష్ సినిమాలో ఏదో స్పెషల్ అయితే చూడబోతున్నామని ఫిక్స్ కావొచ్చు. ఇదే ప్రభాస్ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం.

500 కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించి తెరకెక్కిస్తున్న ఈ 'ఆదిపురుష్' మూవీ ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఆయన సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ జోడించి వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రభాస్ గత రెండు సినిమాలు సాహో, రాధేశ్యామ్ తీవ్ర నిరాశ పర్చడంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ అనే సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్నాయి.

Published by:Sunil Boddula
First published:

Tags: Adipurush, Om Raut, Prabhas

ఉత్తమ కథలు