హోమ్ /వార్తలు /సినిమా /

Prabhas- Kriti Sanon: ప్ర‌భాస్ ఎలాంటి వాడంటే.. రెబ‌ల్‌స్టార్‌పై కృతి స‌న‌న్ కామెంట్

Prabhas- Kriti Sanon: ప్ర‌భాస్ ఎలాంటి వాడంటే.. రెబ‌ల్‌స్టార్‌పై కృతి స‌న‌న్ కామెంట్

Prabhas- Kriti Sanon: రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ వ‌రుసగా భారీ ప్రాజెక్ట్ చిత్రాల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అందులో ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఆది పురుష్ ఒక‌టి. రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఇంకా చదవండి ...

  Prabhas- Kriti Sanon: రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ వ‌రుసగా భారీ ప్రాజెక్ట్ చిత్రాల్లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. అందులో ఓమ్ రౌత్ తెర‌కెక్కిస్తోన్న ఆది పురుష్ ఒక‌టి. రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇక ఇందులో సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తుండ‌గా.. రావ‌ణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, మ‌రో కీల‌క పాత్ర‌లో స‌న్నీ సింగ్ న‌టిస్తున్నారు. కాగా ఈ మూవీలో సీత పాత్ర‌కు గానూ మొద‌టి నుంచి ప‌లువురి పేర్లు వినిపించాయి. అనుష్క శ‌ర్మ‌, అనుష్క శెట్టి, దీపికా ప‌దుకొనే, అలియా భ‌ట్, కీర్తి సురేష్ ఇలా ప‌లువురి పేర్లు వినిపించగా.. చివ‌ర‌కు ఈ అవ‌కాశం కృతిస‌న‌న్‌ను వ‌రించింది. ఇక ఈ మూవీ సెట్‌లో కృతి ఇటీవ‌ల అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ గురించి ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లను చేసింది.

  ప్ర‌భాస్‌ను నేను మొద‌ట్లో క‌లిసిన‌ప్పుడు చాలా సిగ్గుగా ఉన్నాడు. అయితే ఒకసారి మాట్లాడ‌టం ప్రారంభించాక మేమిద్ద‌రం మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ఇక ప్ర‌భాస్ మంచి ఫుడి. అత‌డు మంచిగా తిన‌డ‌మే కాదు. తిండి విష‌యంలో సెట్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. అంద‌రికీ వెరైటీల‌ను పెడుతుంటాడు. ప్ర‌భాస్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా అదృష్టం అని అన్నారు.

  కాగా కృతి స‌న‌న్ ఒక్క‌టే కాదు గతంలో ప్ర‌భాస్‌తో పనిచేసిన వారు ఆయ‌న గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు. సాహో స‌మ‌యంలో శ్ర‌ద్దాకు తెలుగు రుచులను తినిపించాడు ప్రభాస్. అంతేకాదు రాధే శ్యామ్ షూటింగ్‌లో త‌న కోసం హైద‌రాబాదీ వంట‌ల‌ను చేయించారని బాలీవుడ్ న‌టి భాగ్య శ్రీ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపిన విష‌యం తెలిపారు. ఇదిలా ఉంటే భారీ బ‌డ్జెట్‌తో 3డీలో తెర‌కెక్కుతోన్న ఆది పురుష్ మూవీ వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీపై అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి.

  First published:

  Tags: Adipurush movie, Kriti Sanon, Prabhas

  ఉత్తమ కథలు