హోమ్ /వార్తలు /సినిమా /

Adipurush: అయోధ్యలో దిగిన ప్రభాస్... ఆదిపురుష్ ఇన్విటేషన్ చూసి తీరాల్సిందే..!

Adipurush: అయోధ్యలో దిగిన ప్రభాస్... ఆదిపురుష్ ఇన్విటేషన్ చూసి తీరాల్సిందే..!

Adipurush: ఇవాళ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser Launch) లాంఛ్ కార్యక్రమం జరగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ సభ్యులు.. అయోధ్యకు చేరుకున్నారు. 

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్  ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఇవాళే ఆది పురుష్ (Adipurush) టీజర్ రిలీజ్ కాబోతోంది. ఇవాళ అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ (Adipurush Teaser Launch) లాంఛ్ కార్యక్రమం జరగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.  ఇది శ్రీరాముడికి సంబంధించిన సినిమా కావడంతో అయోధ్య  (Ayodhya) వేదికగా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారు. సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ ఎలా చేస్తారో.. అంత భారీ స్థాయిలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ సభ్యులు.. అయోధ్యకు చేరుకున్నారు.  వారి వీడియోలు, అయోధ్యలో ఏర్పాట్ల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  ఆదిపురుష్ టీజర్ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చే అతిథులకు అదిరిపోయే ఇన్విటేషన్ కార్డును దర్శక నిర్మాతలు పంపించారు. అది ఎంతో ఆకర్షణీయంగా..అద్భుతంగా ఉంది.

  ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో భారీ సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో శ్రీరాముడిపాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఆది పురుష్ సినిమాను నిర్మిస్తోంది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Adipurush, Adipurush movie, Prabhas, Tollywood