Akhanda Adiga Adiga Song: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. ఓ సినిమా షూటింగ్ బిజీలో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి తొలి సాంగ్ విడుదలయింది.
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ గతంలో విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి తొలి పాటను విడుదల చేయగా ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో వైరల్ గా మారింది. 'అడిగా అడిగా' అనే పాట విడుదల చేయగా ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి లిరిక్స్ అందించాడు. ఇక ఎస్పీ చరణ్, ఎం ఎల్ శృతి ఈ పాటను పాడి వినిపించారు. ఇందులో తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ పాట నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ పాటకు తెగ లైకులు కూడా వస్తున్నాయి.
ఇది కూడా చదవండి:రసవత్తరంగా మారిన కార్తీకదీపం.. పక్క ప్లాన్ తో మోనిత షాకింగ్ ట్విస్ట్?
ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి సిద్ధమవ్వగా త్వరలోనే ఈ సినిమా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు సినీ బృందం. ఇక ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇందులో బాలయ్య రెండు పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరో మాస్ యాక్షన్ తో తెరకెక్కనున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్ షోకు రామ్ చరణ్.. ఈరోజు షో రచ్చ మాములుగా ఉండదుగా!
అంతేకాకుండా వెంకీ అట్లూరి దర్శకత్వంలో మంచి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న సినిమాలో చేయడానికి సైన్ చేశాడట. ఇదిలా ఉంటే ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు దిల్ రాజు బ్యానర్ లో కూడా మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా పలువురు దర్శకులు కూడా బాలయ్య కోసం సినిమా ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసింది. మొత్తానికి యంగ్ హీరోలతో పోటీ గా దూసుకుపోతున్న బాలయ్య.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు అఖండ సినిమాతో రానున్నాడు. ఇక ఈ సినిమాతో ఎటువంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adiga adiga song, Akhanda movie, Balakrishna, Pragya jaiswal, Tollywood