వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi Sai Kumar). రీసెంట్ గానే తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan) సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన ఇప్పుడు చాగంటి ప్రొడక్షన్ లో "సీఎస్ఐ సనాతన్" (CSI Sanatan) అనే కొత్త సినిమా చేస్తున్నాడు. వైవిద్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఒక డిఫరెంట్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ "సీఎస్ఐ సనాతన్" సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబి చేతులు మీదుగా ఈ విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన బాబీ.. ఈ వీడియో చాలా బాగా వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే.. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ చూపించారు. ఒక హత్య జరిగిందంటే హంతకుడు తప్పకుండా ఉంటాడు. ఐదుగురు అనుమానితులు ఐదు డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నారు. వాటిలో ఏది నిజం అనేది ఆయన విచారణలో తెలుసుకునే క్రమం ఆసక్తిగా ఉండనుంది. నౌ ద రియల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ అనే డైలాగ్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ముగిసింది.
ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం తెలిపారు. తమ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. ఆది సాయి కుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, మధు సూదన్, వాసంతి తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. దీంతో పాటు టాప్ గేర్ అనే మరో సినిమాతో కూడా రెడీ అబుతున్నాడు హీరో ఆది సాయి కుమార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadi Sai Kumar, Tollywood, Tollywood actor