కెరీర్ ఆరంభం నుంచే సెలెక్టెడ్ కథలతో ఆకట్టుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar). ఎప్పటికప్పుడు సరికొత్తగా ట్రాన్స్‌ఫామ్ అవుతూ విలక్షణ కథలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. డిఫరెంట్ యాంగిల్స్ ఉన్న రోల్స్ చేస్తూ ఆడియన్స్ మెప్పు మెప్పు పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు "సీఎస్ఐ సనాతన్" (csi sanatan) అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా భారీ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ సినిమాలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ఐ) ఆఫీసర్ గా ఆది సాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో చిత్రం పై అంచనాలు బాగా పెరిగాయి. విక్రమ్ అనే ప్రముఖ పారిశ్రామికవేత్త యువకుడి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన క్రైమ్ సీన్ ఆఫీసర్ గా ఆది సాయి కుమార్ ఇంటెన్స్ పర్మార్మెన్స్ తో గ్రిప్పింగ్ సన్నివేశాలు ఉండనున్నాయి.
ప్రమోషన్స్ పరంగా డిఫరెంట్ ప్లాన్స్ చేస్తున్న చిత్రయూనిట్.. ఈ సినిమాను మార్చి 10న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్, మిషా నారంగ్, అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప ,మధు సూదన్, వాసంతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనీష్ సోలోమాన్ సంగీతం అందిస్తుండగా.. అజయ్ శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరెకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ మూవీ చివరి దశ పనుల్లో ఉంది. ఆది సాయికుమార్ కెరీర్ లో బెస్ట్ మూవీ అయ్యేలా ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా విజయంపై నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ తో ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadi Sai Kumar, Tollywood, Tollywood actor