HOME »NEWS »MOVIE »adhire abhi says bonus will be given to jabardasth actors with regarding to ratings ak

Jabardasth: జబర్ధస్త్‌లో ఇలా కూడా ఉంటుందా ?.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్

Jabardasth: జబర్ధస్త్‌లో ఇలా కూడా ఉంటుందా ?.. ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ సీక్రెట్
హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ (Twitter/Photo)

Adhire Abhi: జబర్ధస్త్ నటులకు రెమ్యూనరేషన్‌తో పాటు బోనస్ కూడా ఇస్తారని అధిరే అభి వివరించారు. అయితే ఇది అందరికీ కాకుండా కొందరికి మాత్రమే వస్తుందన్నది ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

  • Share this:
    జబర్ధస్త్‌ నటుల రెమ్యూనరేషన్‌‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. అయితే ఎక్కువ రేటింగ్ వచ్చే వారికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుందని చాలామంది నటులు ఓపెన్‌గానే చెప్పారు. ఈ క్రమంలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి టీమ్స్‌కు ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందని కొందరు నటులు చాలా సందర్భాల్లో తెలిపారు. వీటితో పాటు జబర్ధస్త్ నటులు బయట ఈవెంట్స్ ద్వారా బాగానే సంపాదిస్తారనే టాక్ ఉంది. అయితే జబర్ధస్త్‌ ద్వారా రెమ్యూనరేషన్‌తో పాటు వారికి మరో రకమైన ఆదాయం లభిస్తుందనే విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని జబర్ధస్త్‌లో మొదటి నుంచి ఉన్న అదిరే అభి స్వయంగా వెల్లడించారు.

    జబర్ధస్త్ నటులకు రెమ్యూనరేషన్‌తో పాటు బోనస్ కూడా ఇస్తారని ఆయన వివరించారు. అయితే ఇది అందరికీ కాకుండా కొందరికి మాత్రమే వస్తుందన్నది ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. జబర్థస్త్‌లోని అన్ని స్కిట్స్‌కు ఒకే రకమైన రేటింగ్ ఉండదన్నది అందరికీ తెలిసిందే. కొందరి స్కిట్స్‌కు రేటింగ్ ఎక్కువగా ఉంటే.. మరికొందరి స్కిట్స్‌కు రేటింగ్ తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువ రేటింగ్ సాధించే స్కిట్స్‌కు సంబంధించిన టీమ్స్‌కు జబర్ధస్త్ మేనేజ్‌మెంట్ బోనస్ ఇస్తుందని.. రేటింగ్స్ వచ్చిన తరువాత ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని అభి తెలిపారు.



    Adhire abhi angry on set boy in jabardasth show, Jabardasth: సెట్ బాయ్‌పై Adhire Abhi ఫైర్.. జబర్ధస్త్ షోలో సీరియస్, extra jabardasth,etv jabardasth,jabardasth telugu,jabardasth,jabardasth videos,jabardasth punches,jabardasth comedy show,adhire abhi,adhire abhi latest,adhire abhi jabardasth,adhire abhi latest skits,adhire abhi punches,adhire abhi performance,jabardasth adhire abhi,adhire abhi on rgv,adhire abhi craze,adhire abhi biodata,comedian adhire abhi,adhire abhi comedian,adhire abhi comments,lunch with adhire abhi,adhire abhi lifestyle,adhire abhi life story,adhire abhi biography,adhire abhi interview,adhire abhi fires on rgv,adhire abhi movies list,adhire abhi profession,adhire abhi latest video,జబర్ధస్త్,అదిరే అభి జబర్ధస్త్,అదిరే అభి స్కిట్
    అదిరే అభి (PHOTO: YOUTUBE)


    అయితే జబర్ధస్త్ నటులకు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు బోనస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని అభి క్లారిటీ ఇచ్చారు. రెమ్యూనరేషన్‌కు సంబంధించి కాలపరిమితితో కూడిన అగ్రిమెంట్ ఉంటుందని.. దాని ప్రకారమే రెమ్యూనరేషన్ ఇస్తారని తెలిపారు. మొత్తానికి జబర్థస్త్‌లో నటించే స్టార్స్‌కు రెమ్యూనరేషన్‌తో పాటు బోనస్‌లు కూడా బాగానే ఉంటాయని అర్థమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:January 27, 2021, 23:02 IST