ADHIRE ABHI IS MY GOD FATHER IN JABARDASTH COMEDY SHOW SAYS HYPER AADI BS
హైపర్ ఆది గాడ్ ఫాదర్ నాగబాబు కాదట.. అతనెవరంటే..
నాగబాబు, హైపర్ ఆది
నాగబాబు దయ వల్లే హైపర్ ఆది బాగా రాణిస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. ఒక రకంగా హైపర్ ఆదికి గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ, అతడికి గాడ్ ఫాదర్ నాగబాబు కాదట. ఇదే విషయాన్ని ఆది ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
జబర్దస్త్ షోలో ఒక్కో కమెడియన్ది ఒక్కో శైలి.. ఎవరికి వారు తమదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తుంటారు. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, రాకెట్ రాఘవ.. ఇలా తమ కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్విస్తుంటారు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో కావాల్సినంత నవ్వులను పంచుతుంటారు. ఇక జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది.. ప్రత్యేకం. తన కామెడీ అంతా పంచ్ల్లోనే ఉంటుంది. సందర్భానుసానం, సమయస్ఫూర్తితో అతడు వేసే పంచ్‌లకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. మెగా ఫ్యామిలీ అంటే పడిచచ్చే అతడు.. మెగా హీరోలు వేసిన వేషాలకు స్ఫూఫ్ చేస్తూ నవ్వుల్ని పంచుతాడు. తాను ఏది చేసినా మెగా ఫ్యాన్స్‌కు నచ్చేలా, వారు మెచ్చేలా చేస్తుంటాడు. ముఖ్యంగా ఆ షో జడ్జి నాగబాబు అంటే.. హైపర్ ఆదికి తెగ ఇష్టం. షో చూసిన వాళ్లంతా కూడా నాగబాబు దయ వల్లే హైపర్ ఆది బాగా రాణిస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. ఒక రకంగా హైపర్ ఆదికి గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ, అతడికి గాడ్ ఫాదర్ నాగబాబు కాదట. ఇదే విషయాన్ని ఆది ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు.
జబర్దస్త్ తనకు తిండి పెట్టిందని, దానికి కారణం అదిరే అభి అని హైపర్ ఆది తెలిపాడు. అసలు జబర్దస్త్ అనేది ఒకటి ఉందని, ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యింది అభి అన్న వల్లేనని వెల్లడించాడు. బీటెక్ తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వచ్చానని, తాను తీసిన షాట్ ఫిల్మ్ చూసి అభి అన్న కామెంట్ చేశారని.. అలా జబర్దస్త్ ఆఫర్ వచ్చిందని వివరించాడు. అభి అన్న తనకు ఇచ్చిన తొలి రెమ్యునరేషన్ రూ.1000 అని తెలిపాడు. కిరాక్ ఆర్పీ కూడా మంచి దోస్త్ అని వెల్లడించాడు.
ఇక, జబర్దస్త్ డైరెక్టర్లు కూడా తనను చాలా ఎంకరేజ్ చేశారని చెప్పాడు. జబర్దస్త్ కామెడీలో రాజకీయాలేవీ ఉండవని స్పష్టం చేశాడు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని అడగ్గా.. పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని తెలిపాడు. కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని చూసేవాడినని, ఆమెనే ప్రేమించానని వెల్లడించాడు. అయితే, ప్రస్తుతం ఆ అమ్మాయికి పెళ్లైపోయిందని స్పష్టం చేశాడు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.