Home /News /movies /

ADHIRE ABHI ANGRY ON SET BOY IN JABARDASTH SHOW AK

Jabardasth: సెట్ బాయ్‌పై Adhire Abhi ఫైర్.. జబర్ధస్త్ షోలో సీరియస్

అదిరే అభి (PHOTO: YOUTUBE)

అదిరే అభి (PHOTO: YOUTUBE)

Adhire Abhi: అసలు అదిరే అభి సెట్ బాయ్‌పై ఎందుకు ఇంతలా సీరియస్ అయ్యాడనే దానిపై ఆసక్తి నెలకొంది.

    జబర్ధస్త్ అంటేనే కామెడీ షో. అందులో సీరియస్‌నెస్ ఎక్కడా కనిపించదు. కానీ అప్పుడప్పుడు ఈ షోలో కొందరు కంటెస్టెంట్లు సీరియస్ అవుతుంటారు. తాజాగా జబర్ధస్త్ షోలో అదిరే అభి సెట్ బాయ్‌పై సీరియస్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఎప్పుడూ సరదాగా ఉంటే అదిరే అభి అంతగా సీరియస్ కావడంతో జబర్ధస్త్ షోలోని వాతావరణం అంతా మారిపోయింది. తన టీమ్‌లోని కంటెస్టెంట్స్ ఆపుతున్నా.. సెట్ బాయ్‌పై అభి సీరియస్ కావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. వచ్చేవారం టెలికాస్ట్ కాబోయే షోకు సంబంధించిన ప్రోమోలో అదిరే అభి సీరియస్ అయినట్టు ఉన్న సీన్లు ఈ షో అభిమానుల్లోనూ ఉత్కంఠ పెంచుతున్నాయి.

    అసలు అదిరే అభి సెట్ బాయ్‌పై ఎందుకు ఇంతలా సీరియస్ అయ్యాడనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే సెట్ బాయ్స్ ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం వల్ల తమ కామెడీ టైమింగ్ దెబ్బతింటుందని.. వీరికి ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పామని అదిరే అభి.. ఈ ప్రోమోలోనే వివరణ ఇచ్చాడు. అయితే జబర్ధస్త్ ప్రోమోలో లేటెస్ట్‌గా అదిరే అభి సీరియస్‌నెస్ వ్యవహారాన్ని మరికొందరు లైట్ తీసుకుంటున్నారు. ఇదంతా షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు చేసిన ప్లాన్ అని భావిస్తున్నారు.

    గతంలో ఇలాంటివి జబర్ధస్త్‌లో చాలా చూశామని.. ఆ తరువాత షోలో ఇదంతా ఉత్తదే అని తేలిపోయిన సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ షోలో నిజంగానే ఇలాంటి గొడవ జరిగితే అదంతా ఎడిటింగ్‌లో తీసేస్తారని... కాబట్టి ఈ గొడవ అంతా కూడా నిజంగా కాదనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే జబర్ధస్త్ షోలో మొదటి నుంచి ఉన్న అభి.. ఈ రేంజ్‌లో సీరియస్ కావడం మాత్రం చాలామందికి షాక్ ఇచ్చింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Adhire abhi, Jabardasth

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు