Home /News /movies /

Bheemla Nayak : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న భీమ్లా నాయక్ కొత్త పాట.. అడవితల్లి మాట..

Bheemla Nayak : సోషల్ మీడియాలో దూసుకుపోతున్న భీమ్లా నాయక్ కొత్త పాట.. అడవితల్లి మాట..

Pawan Kalyan in Bheemla Nayak Photo : Twitter

Pawan Kalyan in Bheemla Nayak Photo : Twitter

Bheemla Nayak : అడవితల్లి మాట అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 4న ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. పాటలో ఒక పక్క లిరిక్స్‌తో పాటు మరోవైపు పవన్, రానాల విజువల్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత  రీ ఎంట్రీ మూవీ  ’వకీల్ సాబ్’ తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందిస్తున్నారు. మాతృకతో పోల్చితే ఈ సినిమాలో పవన్ ఇమేజ్ కు అనుగుణంగా కొన్ని సన్నివేశాల్లో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో టీమ్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటల్ని వదిలారు. తాజాగా నాల్గవ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అడవితల్లి మాట అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 4న ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కుమ్మరి దుర్గవ్వ, సాహితి చాగంటి పాడారు. పాటలో ఒక పక్క లిరిక్స్‌తో పాటు మరోవైపు పవన్, రానాల విజువల్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. ఈ పాట విడుదలై కొద్ది గంటల్లోనే ఐదు మిలియన్ వ్యూస్ రాబట్టి కేక పెట్టించింది. అంతేకాదు ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను వదిలింది.

    ఇక ఇప్పటికే విడుదలైన టీజర్స్, పాటలతో కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. దీంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోందని అంటున్నారు. అందులో భాగంగానే భీమ్లా నాయక్ నైజాం హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఆర్ఆర్ఆర్ ఎంట్రీతో భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా సంక్రాంతి పండుగను టార్గెట్ చేసుకుని జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడనుందని.. ఫిబ్రవరి 24వ తేదిన విడుదలకానుందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్  సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.


    ఇక తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది చిత్రబృందం. లాలా.. బీమ్లా.. అంటూ సాగే సాంగ్‌ను తివిక్రమ్ రాసారు. త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేసారు. హీరో పవన్ పాత్ర అయిన భీమ్లా నాయక్‌ను హైలైట్ చేస్తూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో రికార్డ్ వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. లైక్స్ పరంగా కూడా కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. వ్యూస్ పరంగా సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్‌ను నమోదు చేసింది. అల్లు అర్జున్ పుష్ప సామి సామి సాంగ్ 24 గంటల్లో 9.06 మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేస్తే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 24 గంటల్లో 10.2 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ఫస్ట్ సాంగ్ రికార్డ్ ను క్రియేట్ చేసింది.

    Sadha : వన్నె తగ్గని అందాల నటి సదా.. లేటెస్ట్ పిక్స్ చూస్తే వావ్ అనాల్సిందే...

    ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తున్నారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు