అడవి శేష్‌ను బండ బూతులు తిట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?

Prabhas Birthday : నేడు ప్రభాస్ 40వ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

news18-telugu
Updated: October 23, 2019, 12:56 PM IST
అడవి శేష్‌ను బండ బూతులు తిట్టిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్,అడవి శేష్ (File Photos)
  • Share this:
నటుడిగా,దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్న అడవి శేష్‌ ప్రభాస్ ఫ్యాన్స్‌తో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్‌లో తాను మాట్లాడినప్పుడు.. ఆ సినిమా నిర్మాతలకు,దర్శకుడు రాజమౌళికి అలాగే పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపినట్టు చెప్పారు. ప్రభాస్ ఫంక్షన్‌కి వచ్చి ఆయన గురించి చెప్పకుండా.. పవన్ కల్యాణ్‌కి థ్యాంక్స్ చెప్పడంతో.. కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని అన్నారు. నిజానికి తాను కావాలని అలా చేయలేదని.. స్టేజీపై ఎక్కగానే తనకు అనిపించిందని మాట్లాడేశానన్నారు. 'పంజా' సినిమా నిర్మాతలు, బాహుబలి నిర్మాతలు ఒక్కరే కావడం.. ఆ సినిమా తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవడంతో.. అందులో అవకాశం ఇచ్చినందుకు నిర్మాత శోభు యార్లగడ్డతో పాటు పవన్‌కి థ్యాంక్స్ చెప్పినట్టు తెలిపారు. అయితే తొందరపాటులో ప్రభాస్ పేరు మరిచిపోయానని.. ఆరోజు రాత్రి తన బ్రదర్ ఫోన్ చేసి చెప్పేంతవరకు తాను ఆ విషయాన్ని గుర్తించలేకపోయానని అన్నారు.

ఇక ఆ మరుసటి రోజు నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్ చేసి తిట్టరాని తిట్లు తిట్టారని గుర్తుచేసుకున్నారు.అప్పుడు కొంత బాధపడ్డానని.. ఇదే విషయాన్ని ప్రభాస్ వద్ద ప్రస్తావించానని చెప్పారు.అదృష్టవశాత్తు ప్రభాస్ దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదని.. దాంతో కొంత రిలీఫ్ ఫీలయ్యానని చెప్పారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌ అలా తిట్టడాన్ని తాను కూడా సీరియస్‌గా తీసుకోలేదని.. వాళ్ల ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. బుధవారం ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో అడవి శేష్ గతంలో వెల్లడించిన ఈ విశేషాలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. కాగా, నేడు ప్రభాస్ 40వ పుట్టినరోజు కావడంతో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
First published: October 23, 2019, 12:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading