Home /News /movies /

ADAVALLU MEEKU JOHARLUS OTT RELEASE DATE LOCKED SB

‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

ఆడవాళ్లు మీకు జోహార్లు ఓటీటీ రిలీజ్ డేట్

ఆడవాళ్లు మీకు జోహార్లు ఓటీటీ రిలీజ్ డేట్

మహిళా దినోత్సవానికి నాలుగురోజుల ముందే రిలీజ్ అయిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనుంది. ఈనెల ఓటీటీలో మూవీ రీలీజ్ కానుంది.

    ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ డ్రామా “ఆడవాళ్లు మీకు జోహార్లు”. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న థియేటర్లలో విడుదలంది. అయితే ఈ మూవీలో మంచి నటీనటులు ఉన్నప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కి సిద్దమయ్యింది. సోనీ లివ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏప్రిల్ 14 నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో ఖుష్బు, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ వివరాల్ని ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది సోనీలివ్‌.

    ఆడవాళ్లు మీకు జోహర్లు సినిమా విషయానికి వస్తే.. పక్కా రొటీన్, ఫార్ములాతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్ రష్మిక నటించినా.. ఈ సినిమా మంచి హిట్ అందుకోలేకపోయింది. అయితే ఈ చిత్రంలో బలమైన సన్నివేశాలు, భావోద్వేగం లోపించడం వల్ల ప్రేక్షకులకు ఇది రెగ్యులర్ సినిమాగానే అనిపిస్తుంది. ఖుష్బు, రాధిక వంటి భారీ ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఉన్నప్పటికీ.. వారి రేంజ్‌ సరిపడినట్టుగా పాత్రలను డిజైన్ చేయలేకపోవడం సినిమాకు మైనస్ పాయింట్ అనే చెప్పాలి.

    ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ... మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను మహిళాదినోత్సవానికి నాలుగురోజులు ముందు రిలీజ్ చేసిన సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మహిళా ప్రేక్షకులకి నచ్చేలా ఉంది తప్ప మిగిలిన వర్గాల వాళ్లకి ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. శర్వానంద్ విషయానికి వస్తే... గత పది 15 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాడు. అతని కెరీర్‌లో మంచి హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి.

    అయితే ఐదేళ్లుగా శర్వానంద్‌కు సరైన హిట్ ఒకటి కూడా సాధించలేదు. మారుతీ దర్శకత్వం వహించిన మహానుభావుడు. ఆ సినిమాకు మారుతీ బ్రాండింగ్ కూడా ఉంది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కాస్త వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ఆ తర్వాత వచ్చిన రాధ, పడి పడి లేచె మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం ఫ్లాప్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలో ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ కూడా శర్వానంద్‌కు మైనస్ అయ్యింది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుండటంతో దీన్ని చేసేందుకు ఎంతవరకు సినీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారో వేచి చూడాలి. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rashmika mandanna, Sharwanand, Tollywood, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు