తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ (Sharwanand) కూడా ఒకడు. అయితే ఈ మధ్య ఈయన అదృష్టం మాత్రం వెక్కిరిస్తుంది. వరస సినిమాలు చేస్తున్నాడు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. మరీ ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు కూడా దారుణంగా నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో విడుదలైన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu trailer). శర్వానంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ అంతకంటే యావరేజ్‌గా వచ్చాయి. కిషోర్ తిరుమల (Kishore Tirumala) తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ స్లో నెరేషన్ కారణంగా సినిమాకు వసూళ్లు తక్కువగా వచ్చాయి. నేను శైలజ (Nenu Sailaja), చిత్రలహరి (Chitralahari), రెడ్ (RED) లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు కిషోర్. మధ్యలో రామ్‌తో (Ram Pothineni) చేసిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. కానీ హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ ఎమోషనల్ డ్రామాతో వచ్చాడు ఈయన. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం..
నైజాం: 0.72 కోట్లు
సీడెడ్: 0.18 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.20 కోట్లు
ఈస్ట్: 0.09 కోట్లు
వెస్ట్: 0.08 కోట్లు
గుంటూరు: 0.12 కోట్లు
కృష్ణా: 0.11 కోట్లు
నెల్లూరు: 0.07 కోట్లు
ఏపీ, తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్: 1.57 కోట్లు (2.90 కోట్లు గ్రాస్)
రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 0.12 కోట్లు
ఓవర్సీస్: 0.23 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 1.92 కోట్లు (3.60 కోట్లు గ్రాస్)
శర్వానంద్ గత సినిమా మహా సముద్రం, శ్రీకారం సినిమాలకు తొలిరోజు కనీసం 4 కోట్లకు పైగా షేర్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆడవాళ్లు మీకు జోహార్లు మాత్రం కేవలం 1.92 కోట్లతోనే సరిపెట్టుకుంది. కనీసం 2 కోట్ల షేర్ కూడా రాబట్టలేదు. ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 16 కోట్లు షేర్ రావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత వసూలు చేయడం అంటే అసాధ్యంగానే కనిపిస్తుంది. రష్మిక మందన్న అందాలు.. శర్వానంద్ నటన కూడా ఈ సినిమాను కాపాడేలా కనిపించడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Rashmika mandana, Sharwanand, Telugu Cinema, Tollywood