త్రివిక్రమ్ నా సీన్స్‌ను తీసేయడం బాధను మిగిల్చింది : ఆదర్శ్

నటుడు ఆదర్శ్ తెలుగులో ప్రసారమైన 'బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్' ద్వారా తెలుగువారికి మరింత దగ్గరైయాడు.

news18-telugu
Updated: January 10, 2020, 10:48 PM IST
త్రివిక్రమ్ నా సీన్స్‌ను తీసేయడం బాధను మిగిల్చింది : ఆదర్శ్
Instagram
  • Share this:
నటుడు ఆదర్శ్ విలన్‌గా కొన్ని సినిమాల్లో నటించినా..  మాటీవీలో ప్రసారమైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1' ద్వారా తెలుగువారికి మరింత దగ్గరైయాడు. ఈ షోతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో ఆదర్శ్ తెలుగు సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాకుండా ఆదర్శ్ చాలా సెలెక్టీవ్‌గా తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ఆదర్శ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సందర్భంగా ఆదర్శ్ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అరవింద సమేత' గురించి మాట్లాడాడు. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో 'అరవింద సమేత'లో నటించానని.. అయితే తాను చేసిన ఓ సీన్‌ను ఫైనల్ ఎడిటింగ్‌లో లేపేశారన్నారు. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తాను చేసిన ఆ సీన్ అంటే చాలా ఇష్టం అన్నారు. అయితే అలాంటి సీన్ లేపేయడం చాలా బాధను కలిగించిందని.. ఈ విషయాన్ని త్రివిక్రమ్ గారి దగ్గర తెలియజేస్తూ.. తన ఆవేదనను వ్యక్తం చేశానని చెప్పారు ఆదర్శ్.

పూలతో కవ్విస్తోన్న అందాల నిధి...


First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు