రీసెంట్‌గా హిందీ వెబ్ సిరీస్ ‘పతీ పత్నీ ఔర్ పంగా’ లో ట్రాన్ ఉమెన్‌గా నటించిన అందరి దృష్టిని ఆకర్షించింది ఆదాశర్మ. ఇదేంటి ఇలాంటి సినిమాలో నటించడం కెరీర్‌కు ఇబ్బంది కదా! అని ప్రశ్నిస్తే.. లింగ వివక్షతకు భిన్నమైన కాన్సెప్ట్ సినిమాలను చేయాలనుకుంటున్నానని గడుసుగా సమాధానం చెప్పింది ఆదాశర్మ. ట్రాన్స్ ఉమెన్ పాత్రను పోషించాలని నన్ను అడగ్గానే నేను ఆలోచించాను. ఇలాంటి పాత్రను చేయడం వల్ల ఎంత మంది నన్ను నటిగా స్వీకరిస్తారు. ఎంత మంది నన్ను విమర్శిస్తారు అని. ఆ పాత్రలో ఒదిగిపోవడం చాలా కష్టమని తెలుసు. అయినా చేయడానికి నేను సిద్ధమయ్యాను అని ఆదాశర్మ చెప్పింది. డిఫరెంట్ కాన్సెప్ట్, రోల్స్ చేయడానికి నేను సిద్ధం అంటూ చెబుతోన్న ఆదాశర్మకు మరి నిర్మాతలు అవకాశాలు ఇస్తారో ఇవ్వరో చూడాలి.
హారర్ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఆదాశర్మను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుడి గుండెలో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ ఎందుకనో ఆదాశర్మకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. క్షణం వంటి సూపర్‌హిట్ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా క్రెడిట్ అంతా అడివిశేష్ కొట్టేశాడు. ఒకానొక దశలో తెలుగు సినిమాల్లో ఆదాశర్మ సెకండ్ హీరోయిన్‌గానే పరిమితం అయ్యింది. సుబ్రమణ్యం ఫర్ సేల్, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలే అందుకు ఉదాహరణలు. విద్యుజమ్మాల్‌తో కలిసి కమొండో సిరీస్‌లోనూ నటించింది ఆదాశర్మ. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆమె శిక్షణ తీసుకుంది.
ఓ అబ్బాయి.. ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారుతాడు. పెళ్లి కూడా అవుతుంది. పెళ్లి తర్వాత అత్తగారింట్లో అసలు నిజం తెలుస్తుంది. అప్పుడు సదరు ట్రాన్స్ ఉమెన్‌కు ఎలాంటి సమస్యలు వస్తాయి? చివరకు ఏమౌతుంది? అనే కాన్సెప్ట్‌తో రూపొందినదే ‘పతీ పత్నీ ఔర్ పంగా’. అబీర్ సేన్ గుప్తా దర్శకుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adah sharma, Bolllywood, Tollywood news