లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషం తెలిసింది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.తాజాగా ఈ సినిమాలో విజయశాంతి ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. ‘ సరిలేరు నీకెవ్వరులో భారతిగా... లేడీ అమితాబ్ విజయశాంతి మేడమ్ ఫస్టు లుక్ అంటూ ఆయన పోస్టు పెట్టారు. విజయశాంతి స్టిల్‌తో కూడిన ఫోటోను కూడా షేర్ చేశారు. ఇందులో విజయశాంతి కుర్చీలో దర్జాగా కూర్చున్నారు.
సరిగ్గా 30 ఏళ్ల క్రితం వచ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో విజయశాంతి, మహేష్ బాబు కలిసి నటించారు. అందులో వీరిద్దరూ తల్లి కొడుకులుగా నటించిన విషయం తెలిసింది. అప్పట్లో ఆ సినిమాను కృష్ణ దర్శకత్వం వహించడం విశేషం. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయశాంతితో మరోసారి ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు మహేష్.