రాజకీయాల్లోనూ రాణించాలనుకున్న విజయ నిర్మల.. అందుకే అక్కడి నుంచి పోటీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతోమంది ప్రజలతో ఆమె మమేకమయ్యారని.. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేవారని కైకలూరు ప్రజలు చెబుతున్నారు.

news18-telugu
Updated: June 28, 2019, 8:35 AM IST
రాజకీయాల్లోనూ రాణించాలనుకున్న విజయ నిర్మల.. అందుకే అక్కడి నుంచి పోటీ..
విజయ నిర్మల (File Photo)
  • Share this:
సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల.. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ రాణించడానికి ప్రయత్నించారు. అయితే సినిమాల్లో లాగా రాజకీయాల్లో ఆమె అంతగా రాణించలేకపోయారు. 1999లో టీడీపీ తరుపున ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1,102ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి రాజారామచందర్‌పై ఓటమిపాలయ్యారు. విజయ నిర్మల మృతితో కైకలూరు ప్రజలు అప్పట్లో ఆమె పోటీ చేసిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. 1989లో హీరో కృష్ణ ఏలూరు పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలోనూ విజయ నిర్మల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతోమంది ప్రజలతో ఆమె మమేకమయ్యారని.. ప్రజా సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకునేవారని కైకలూరు ప్రజలు చెబుతున్నారు. కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించేందుకు తనవంతుగా చాలానే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. కైకలూరులో ఓటమిపాలైనప్పటికీ.. ఆ తర్వాత కూడా నియోజకవర్గ సమస్యలపై ఆరా తీశారని చెబుతున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: June 28, 2019, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading