Home /News /movies /

ACTRESS VANITHA VIJAYKUMAR SHOCKING COMMENTS ON NTR AND HER FAMILY IN ALITHO SARADAGA SHOW NR

Vanitha Vijaykumar: నాకు బుర్రలేదండి.. తారక్‌తో ఒక్క షాట్ చాలు.. వనిత విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

vanitha vijaykumar

vanitha vijaykumar

Vanitha Vijaykumar: సినీ నటి వనిత విజయ్ కుమార్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

    Vanitha Vijaykumar: సినీ నటి వనిత విజయ్ కుమార్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు భాషల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక తన పరిచయాన్ని ఎక్కువగా నటిగా కాకుండా వ్యక్తిగత విషయంలో పెంచుకుంది వనిత. ఇప్పటికే మూడు పెళ్లిళ్ల తో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా తనకు బుర్ర లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

    గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయిన వనిత విజయ్ కుమార్ ఆ మధ్య మూడో పెళ్లితో అందరిని షాకయ్యేలా చేసింది. ఇక ఆ పెళ్లి కూడా పెటాకులు కావడంతో వ్యతిరేకమైన విమర్శలు ఎదుర్కొంది. ఆ మధ్య తను తమిళ పవర్ స్టార్ శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫోటో కూడా పంచుకుంది. ఇక ఆ ఫోటోకు ఊహించుకోలేనంత రేంజ్ లో కామెంట్స్ వచ్చాయి. కానీ తాను నటిస్తున్న సినిమాలోని పోస్టర్ అని షాక్ ఇచ్చింది.

    ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షో గురించి అందరికి తెలిసిందే. తాజాగా ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదలయింది. అందులో వనిత విజయకుమార్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆలీ తనను.. నాగలక్ష్మి, మహేశ్వరి, వనిత విజయ్ కుమార్ అని నాలుగైదు పేర్లు పెట్టేసుకున్నారు అనగా ముగ్గురు అక్కడ ముగ్గురు ఇక్కడ అంటూ సమాధానమిచ్చింది.దేవి సినిమా తర్వాత ఎందుకు రాలేదు.. కారణం ఏంటి అని ప్రశ్నించగా.. వెంటనే వనిత బుర్ర సరిగా లేదంటూ సమాధానమిచ్చింది.



    ఇప్పుడిప్పుడే తయారవుతుంది అంటూ పంచ్ వేసింది. తన ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు పంచుకుంది. తమిళ పవర్ స్టార్ పెళ్లి గురించి ఆలీ ప్రశ్నించడంతో.. నాలుగు పెళ్ళిళ్ళు కాదు 40 పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్ చేసింది. తనకు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ తో లైఫ్ లో ఒక్క షాట్ అయినా నటించాలనే డ్రీమ్ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. తను నటించిన దేవి సినిమాలో తనకు బొట్టు పెట్టిన పాము నిజమేనని..అది తనను కాటేసిందని.. ఒకవేళ దానివల్ల చనిపోతే మంచిదేనని తన తల్లి చెప్పిందని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Alitho saradaga show, Comedian ali, Tollywood, Vanitha Vijaykumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు