హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ రోజా గుడ్ న్యూస్... మరో షోలో ఎంట్రీ...

జబర్దస్త్ రోజా గుడ్ న్యూస్... మరో షోలో ఎంట్రీ...

నటి రోజా (Jabardasth Comedy Show)

నటి రోజా (Jabardasth Comedy Show)

Jabardasth Roja : ఇప్పటికే జబర్దస్త్ షోలతో రేటింగుల రికార్డులు సృష్టిస్తున్న ఎమ్మెల్యే రోజా... త్వరలో... మరో షోతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

  Jabardasth Roja : అటు రాజకీయ నేతగా... నగరి ఎమ్మెల్యేగా... ఇటు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ... ఫుల్ బిజీగా ఉంటున్నారు జబర్దస్త్ కామెడీ షో జడ్జి రోజా. జబర్దస్త్ షోకి ఆరేళ్లు జడ్జిగా చేసి... ఆ షో నుంచీ నాగబాబు వెళ్లిపోయిన తర్వాత... రోజాపై బాధ్యతలు మరింత పెరిగాయి. అయినప్పటికీ... ఆ షోను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న రోజా... త్వరలో మరో షోతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారని తెలిసింది. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో... నాన్ ఫిక్షన్ షోకి రోజా సైన్ చేసినట్లు తెలిసింది. ఈ షో త్వరలోనే ప్రసారం కాబోతుందని టాలీవుడ్ టాక్. ఇందులో ప్రధానంగా... యువ సెలబ్రిటీలు... తమ తమ తల్లులతో కనిపిస్తారనీ... వారితో రోజా సరదాగా మాట్లాడతారని తెలిసింది. తాజా రిపోర్టుల ప్రకారం ఈ నెలలోనే ఈ షో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే టీజర్, ప్రోమో షూటింగ్ పూర్తైందనీ చెబుతున్నారు. ఐతే... దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

  ఇప్పటికే రెండు వైవిధ్యభరత షోలైన జబర్దస్త్ కామెడీ షో, బతుకు జట్కాబండి షోలను రోజా చేస్తున్నారు. రెండూ రెండు రకాలు. ఒకటి కామెడీ అయితే రెండోది సీరియస్ సబ్జెక్ట్. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్న రోజా... అదే సమయంలో ఎమ్మెల్యేగా, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా రాజకీయ పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రతిపక్షాలపై అప్పుడప్పుడూ విరుచుకుపడుతూ వైసీపీలో ఫ్రైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్న రోజాపై తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానం ఉంది. తాజాగా ఆమె ఫన్‌తో కూడిన షోతో పలకరించబోతున్నారన్న అంశం అభిమానులకు పండగే.


  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Jabardasth comedy show, MLA Roja, Tollywood news

  ఉత్తమ కథలు