పెళ్లికి సిద్ధమే అంటున్న సౌత్ స్టార్ త్రిష...అయితే..

Trisha on Marriage | వివాహ బంధంపై తనకు నమ్మకముందని, తనకు నచ్చినవాడు కనిపిస్తే రేపే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమంటోందని సినీ నటి త్రిష.

news18-telugu
Updated: March 18, 2019, 11:44 PM IST
పెళ్లికి సిద్ధమే అంటున్న సౌత్ స్టార్ త్రిష...అయితే..
త్రిష (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
సినీ ఇండస్ట్రీలో ఒకటిన్నర దశాబ్ధ కాలానికి పైగా హీరోయిన్‌గా రాణిస్తున్న త్రిష పెళ్లిపై దేశ దక్షిణాది మీడియాలో నిత్యం పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ప్రొఫషనల్ లైఫ్‌తో పాటు పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన గాలి వార్తలకు తమిళ మీడియాలో నిత్యం కొదవే ఉండదు. 35 ఏళ్ల ఈ చెన్నై బ్యూటీ ఇటీవల నటించిన ‘96’ హిట్ సాధించగా...రజనీకాంత్ ‘పేట్టా’ చిత్రంలోనూ ఆమె నటించింది. వరుణ్ మణియన్ అనే వ్యక్తితో త్రిషకు ఎంగేజ్‌మెంట్ జరిగినా...ఏవో కారణాలతో కొన్ని మాసాల తర్వాత పరస్పర అంగీకారంతో వారు విడిపోయారు. ఇటీవల వివాహ బంధంపై త్రిష ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పింది. ప్రస్తుతం తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేనని స్పష్టంచేసింది.

త్రిష(ఫైల్ ఫోటో)


పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు నచ్చిన వ్యక్తి కనబడితే రేపే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని చెప్పుకొచ్చింది. త్రిషకు నచ్చిన వ్యక్తి...ఆమెకు ఎప్పుడు తారసపడుతాడో మనం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం తమిళంలో చేతినిండా ప్రాజెక్టులతో త్రిష బిజీగా ఉంది.
First published: March 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading