Home /News /movies /

ACTRESS TDP LEADER DIVYAVANI STRONG WARNING TO DIRECTOR RAM GOPAL VARMA TA

ఈ సినిమాలు తీయడానికి రామ్ గోపాల్ వర్మకు దమ్ముందా.. టీడీపీ నేత దివ్యవాణి కామెంట్స్..

దివ్యవాణి, రామ్ గోపాల్ వర్మ

దివ్యవాణి, రామ్ గోపాల్ వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి టీడీపీ నాయకురాలు దివ్యవాణి తనదైన శైలిలో స్పందించింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటి టీడీపీ నాయకురాలు దివ్యవాణి తనదైన శైలిలో స్పందించింది. తాజాగా  వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ఈ రోజు ఏపీలో విడుదల కావాల్సి ఉండగా..కేంద్ర ఎన్నికల కమిషన్..సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు  ఈ సినిమా విడుదలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదల కాలేకపోయంది. ఈ సినిమా విడుదల కాకపోవడంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. రామ్ గోపాల్ వర్మకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందేకదా. దీనిపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి జగన్‌తో పాటు వర్మపై తనదైన శైలిలో విరుచుకుపడింది. ఏపీ ప్రతిపక్ష నేతకు ఏపీలో ఫొని తుఫాను, నీటి సమస్యలు..తెలంగాణ ఇంటర్ విద్యార్ధుల  ఆత్మహత్యలపై స్పందించే సమయం లేదు కానీ.. వర్మకు ట్విట్టర్‌లో మద్దతు ప్రకటించడం గర్హనీయమన్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ..నీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్ ఇంట్లో జరిగిన హత్యోదంతంపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. అంతేకాదు కేసీఆర్‌పై బయోపిక్ తీస్తోన్న వర్మ.. తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం వర్మకు ఉందా అని ప్రశ్నించింది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అండతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కించి చంద్రబాబును టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు. వెంటనే రామ్ గోపాల్ వర్మ తన తప్పు తెలుసుకొని సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Chandrababu naidu, Divyavani, Election Commission of India, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, Lok Sabha Elections 2019, Ram Gopal Varma, Tdp, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు