Home /News /movies /

ACTRESS TAMANNAAH BHATIA SINGS HRITHIK ROSHAN SONG ANUSHKA COMMENT ON VIDEO MNJ

Tamannaah- Anushka: సింగ‌ర్ అవ‌తార‌మెత్తిన త‌మ‌న్నా.. కామెంట్ పెట్టిన అనుష్క‌.. వీడియో వైర‌ల్‌

తమన్నా అనుష్క

తమన్నా అనుష్క

అందం, అభినయంతో ఆక‌ట్టుకొంటూ కొన్నేళ్లుగా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. కాగా ఈ అమ్మ‌డు తాజాగా త‌న‌లోని కొత్త‌ టాలెంట్‌ని బ‌య‌టపెట్టింది. ఇన్ని రోజులు తన న‌ట‌న‌, డ్యాన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న త‌మ‌న్నా

ఇంకా చదవండి ...
    Tamannaah- Anushka: అందం, అభినయంతో ఆక‌ట్టుకొంటూ కొన్నేళ్లుగా ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. కాగా ఈ అమ్మ‌డు తాజాగా త‌న‌లోని కొత్త‌ టాలెంట్‌ని బ‌య‌టపెట్టింది. ఇన్ని రోజులు తన న‌ట‌న‌, డ్యాన్స్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న త‌మ‌న్నా.. ఇప్పుడు త‌న‌లో ఉన్న సింగ‌ర్‌ని బ‌య‌ట‌కు తీసింది. హృతిక్ రోష‌న్, ప్రీతి జింటా న‌టించిన మిష‌న్ క‌శ్మీర్ చిత్రంలోని సోచే కే జీలోన్ పాట‌ను త‌న గాత్రంతో ఆల‌పించింది త‌మ‌న్నా. దీన్ని మిల్కీ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. బెంగ‌ళూరులో ఉన్న వాతావ‌ర‌ణం త‌న‌కు ఇలా ఉంద‌ని చెబుతూ త‌మ‌న్నా ఈ పాట‌ను పాడింది. ఇక ఈ వీడియోలో త‌న సింగింగ్ టాలెంట్‌తో అద‌ర‌గొట్టేసింది త‌మ‌న్నా. ఇక ఈ పోస్ట్ అంద‌రినీ ఆక‌ట్టుకుండుగా.. యోగా బ్యూటీ అనుష్క శెట్టి కూడా కామెంట్ పెట్టారు. ల‌వ్ సింబ‌ల్‌తో పాటు, హ‌గ్ ఎమోజీని అనుష్క పెట్టారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

    ఇదిలా ఉంటే ప్రస్తుతం త‌మ‌న్నా తెలుగులో నాలుగు చిత్రాల్లో న‌టిస్తోంది. అందులో వెంక‌టేష్ స‌ర‌స‌న ఎఫ్ 3, గోపిచంద్ స‌ర‌స‌న సిటీ మార్, నితిన్ స‌ర‌స‌న అంధ‌ధూన్ రీమేక్‌, స‌త్యదేవ్ స‌ర‌స‌న గుర్తుందా సీతాకాలంలో త‌మ‌న్నా న‌టిస్తున్నారు. ఇక హిందీలో భోలే చూడియాన్ చిత్రంలో నటిస్తుండ‌గా.. ఆ మూవీకి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీకి విడుద‌ల తేదిని ఖ‌రారు చేయ‌నున్నారు. ఇక వీటితో పాటు తెలుగులో త‌మ‌న్నా.. క్వీన్ రీమేక్ ద‌టీజ్ మ‌హాల‌క్ష్మిలో న‌టించింది. ఈ మూవీ కూడా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.



    ఇక నవంబ‌ర్ స్టోరీ అనే త‌మిళ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్‌లోనూ త‌మ‌న్నా న‌టించారు. ఇది త్వ‌ర‌లో హాట్ స్టార్‌లో రానుంది. అలాగే తెలుగులో లెవ‌న్త్ అవ‌ర్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇటీవ‌లే ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. వీటితో పాటు మ‌రికొన్ని ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published:

    Tags: Anushka, Anushka Shetty, Tamannah

    తదుపరి వార్తలు