ఆ డైరెక్టర్‌తో ఆ పని చేయాలనేది తాప్సీ కోరికట.. ఇంతకీ ఏమిటో తెలుసా..

ఎపుడైతే టాలీవుడ్‌కు టాటా చెప్పి ..బాలీవుడ్‌కు మకాం మార్చిందో అప్పటి నుంచి హీరోయిన్‌గా తాప్సీ దశ తిరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ..హిందీలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌‌కు  బెస్ట్ ఆప్షన్‌గా మారింది. మరోవైపు తాప్సీకి ఇండస్ట్రీలో తీరని కోరిక ఒకటి ఉంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 2, 2019, 5:55 PM IST
ఆ డైరెక్టర్‌తో ఆ పని చేయాలనేది తాప్సీ కోరికట.. ఇంతకీ ఏమిటో తెలుసా..
తాప్సీ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఎపుడైతే టాలీవుడ్‌కు టాటా చెప్పి ..బాలీవుడ్‌కు మకాం మార్చిందో అప్పటి నుంచి హీరోయిన్‌గా తాప్సీ దశ తిరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ..హిందీలో ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌‌కు  బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఇప్పటికే ‘పింక్’, ‘ముల్క్’ వంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది తాప్సీ. తాజాగా ఈ భామ సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘బద్లా’ మూవీతో పలకరించడానికి వస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించారు. ‘పింక్’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత వీళ్లిద్దరు మరోసారి ఈసినిమాలో నటించారు.

తాజాగా తాప్సీ టాలీవుడ్‌లో అందరు నన్ను గ్లామర్ డాల్‌గానే చూసారు. కానీ బాలీవుడ్‌లో మాత్రం తనకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కుతున్నాయంది. తెలుగులో మంచి స్టోరీ ఉంటే చేయడానికి రెడీ అంటూ చెబుతుంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే వెడ్డింగ్ ప్లానర్‌గా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ నా చెల్లెలుతో పాటు కజిన్స్ చూసుకుంటున్నారని చెప్పింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత ఏదో ఒకటి ముందే ప్రిపేర్ చేసుకోవాలిగా గడుసుగా సమాధానం ఇచ్చింది.

మరోవైపు తాప్సీకి ఇండస్ట్రీలో తీరని కోరిక ఒకటి ఉంది. అదే మణిరత్నం దర్శకత్వంలో నటించాలనేది తన కోరిక అని చెప్పంది. ఆ తన సినిమాల్లో హీరోయిన్స్‌ను  చాలా అందంగా చూపిస్తారు. సినిమాల్లో వచ్చినప్పటి నుంచి ఆయనతో పనిచేయాలనేది తన డ్రీమ్. అంతేకాదు హీరోయిన్‌గా కెరీర్ ఎండ్ అయిన తర్వాత ఢిల్లిలోనే సెటిల్ అవుతానంటూ ముగించింది.

 
First published: March 2, 2019, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading