లక్ష్మీ పార్వతిపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నదో తెలుసా..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరు లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న శ్రీరెడ్డి..తాజాగా లక్ష్మీ పార్వతిపై తనదైన శైలిలో పంచ్‌లు వేసింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 25, 2019, 5:30 PM IST
లక్ష్మీ పార్వతిపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నదో తెలుసా..
లక్ష్మీపార్వతి, శ్రీరెడ్డి ఫైల్
  • Share this:
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి తెలియని వారు ఎవరు లేరు. తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం తెర వెనక జరుగుతున్న కౌస్టింగ్ కౌచ్‌పై గళమెత్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తున్న శ్రీరెడ్డి..తాజాగా లక్ష్మీ పార్వతిపై తనదైన శైలిలో పంచ్‌లు వేసింది. అంతేకాదు త్వరలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కించబోతున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై స్పందిస్తూ ఎవరిలో అయినా నెగిటివ్, పాజిటివ్ రెండు కోణాలు ఉంటాయి. ఎవరికి వాళ్లు తాము మంచి వాళ్లమనే ఫీలింగ్‌లో ఉంటారు. వారు ఏ పని కూడా పాపపు పని అనుకోరు.లక్ష్మి పార్వతి తనను తాను పాజిటివ్‌గా చూపించుకోవడానికి రామ్ గోపాల్ వర్మతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా చేయించుకున్నట్టు ఉంది.

మరోవైపు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం..లక్ష్మీ పార్వతిలోని నెగిటివ్ కోణం చూపించాలనుకుంటున్నారు. ఒక నటిగా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను నటిని. నాకు తప్పొప్పులతో సంబంధం లేదు.

మరోవైపు బాలయ్య తాను చేస్తున్న సినిమా గురించి ఒకటే చెప్పారు. మా నాన్నగారిని ఎలా చూశామో, ఆయన ఎంత గొప్ప వ్యక్తే అనేది సినిమా రూపంలో చూపించాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాగే చూపించారు. కొన్ని విషయాలు టచ్ చేయడం లేదని క్లియర్‌గా చెప్పారు. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఆవిడ కోణంలో రైట్ అనిపించువచ్చు. అది నిజం కావచ్చు. కాకపోవచ్చు కూడా. రామ్ గోపాల్ వర్మ ఫేమస్ అయినంత మాత్రాన ఆయన ఏది చూపిస్తే అది జనం నమ్ముతారా ? లేదా చూడాలి.ఇక ఎన్టీఆర్ 1923లొ జన్మించారు. వీరగంథం సుబ్బారావు 1937లో పుట్టారు. లక్ష్మీ పార్వతి ఏమైనా అంటే..ఆయనకు నాకు పదిహేడేళ్లు తేడా.నేను హ్యాపీగా ఉండలేకపోయాను. కాపురం చేయలేకపోయాను అని అన్నారు. మరి ఎన్టీఆర్ విషయంలో ఎవరూ ఆమెను ఈ విషయం అడగలేదా ? వీరగ్రంథం సుబ్బారావు కంటే ఎన్టీఆర్ వయసులో చాలా పెద్దవారు. అంతకన్నా ఎక్కువ ఏజ్ ఎక్కువున్న వ్యక్తితో మీకు ఎన్ని విభేదాలు రావాలి ? ఆయనకు భార్య లేదు. ఒంటరివాడైనందకు వండి పెట్టాను. దగ్గరుండి చూసుకున్నాను,ప్రేమించాను అని లక్ష్మీ పార్వతి ప్రతి సందర్భంలో చెబుతూ ఉంటారు. మరి మీ ఆయన్ని నువ్వు ఒదిలేసినపుడు మీ ఆయన ఒంటరి కాలేదా ? 16 ఏళ్ల కొడుకును ఒదిలేసి వచ్చినపుడు ఆ పిల్లాడు ఒంటరి వాడు కాదా ? ఏవిధంగా నువ్వు సరైన భార్య వు.? ఏ విధంగా సరైన తల్లివి అంటూ లక్ష్మీ పార్వతి నైజాన్ని శ్రీరెడ్డి కడిపారేసింది.
First published: February 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు