Bigg Boss 3 | నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

శ్రీరెడ్డి, నాగార్జున (File)

Sri Reddy | తన ఫేస్ బుక్ పేజీలో నాగార్జున మీద తీవ్ర ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.

  • Share this:
    ఎప్పుడూ ఏదో ఒక సంచలన కామెంట్స్‌తో వార్తల్లో ఉండే శ్రీరెడ్డి ఈసారి మరో సీరియస్ కామెంట్స్ చేసింది. ఈసారి కింగ్ నాగార్జునను టార్గెట్ చేసింది. ‘నాగార్జునగారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబుగారికి కూడా తెలీవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో. ఇవ్వకపోతే బిగ్ బాస్ గాడు ఒక వెధవ’ అని ఇంగ్లీష్‌లో పోస్ట్ చేసింది. నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ రియాలిటీ షో మీద గతంలో పెద్ద దుమారం రేగింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్ గా వెళ్లాలంటే లైంగిక కోర్కె తీర్చాలని అడిగారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపించారు. ఏకంగా ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరోవైపు బిగ్ బాస్ 3‌లో శ్రీరెడ్డికి చోటు దక్కుతుందని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆమె మాత్రం రియాలిటీ షోలో కనిపించలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో అప్పుడే మొదటి వారం ఎలిమినేషన్ కూడా జరగబోతోంది. హేమ, జాఫర్, వితిక, రాహుల్ ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అయితే, వారిలో ఎవరు బయటకు వెళ్తారనే ఆసక్తి నెలకొంది.

    First published: