ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Maa) ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల అనంతరం మా ఎన్నికల తీరుపై చాలామంది తప్పుపట్టారు. ప్రకాష్ రాజ్(Prakash Raj) ప్యానల్ నుంచి 11 మంది సభ్యులు కూడా రాజీనామా(Resign) చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ ను గెలిపించుకోవడంలో మెగా ఫ్యామిలీ విఫలం అయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా సమంత(Samantha), నాగచైతన్య(Naga chaitanya) విడాకుల విషయంలో కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి రోజున (అక్టోబర్ 2, 2021) సాయంత్రం సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు వారి సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.
విడిపోవడానికి గల కారణం మాత్రం వాళ్లు చెప్పలేదు. దీంతో ఆ రోజు నుంచి ఫలానా కారణంతోనే విడిపోయారనే వార్తలు కొకొల్లలుగా వచ్చాయి. సమంత వైపే తప్పు ఉందని కొందని విమర్శలు చేస్తే.. నాగచైతన్య ఫ్యామిలీ వైపే తప్పు ఉందంటూ మరి కొందరు వార్తలు రాశారు. ఇలా వివిధ రకాలు కారణాలతో సోషల్ మీడియాలో వీళ్ల విడాకుల గురించే ఎక్కువ రచ్చ జురుగుతోంది. ఇప్పటికీ ఆగలేదు. రోజుకో వార్త వస్తూనే ఉంది. వాళ్లు ఇద్దరు విడిపోయి కొత్త జీవితాలకు స్వాగతం పలుకుతూ.. వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ ఇంకా వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. సమంత పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో ఎఫైర్ నడిచిందని.. అందుకే వాళ్లు విడిపోయారని.. సమంతదే తప్పు అన్నట్లు కూడా చూపించారు.
దీనికి బలమైన కారణం ఏంటంటే.. ప్రతీమ్ ఒళ్లో సమంత కాళ్లు పెట్టుకున్న ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారడం.. ఆ వెంటనే సమంత ఆ పోస్ట్‌ను డిలీట్ చేయడం జరిగింది. ఇలా జరగడంతో ఆ అనుమానాలకు బలం చేకూరినట్లు కూడా అయింది. సమంత వ్యవహారంపై ప్రతీమ్ పలుమార్లు స్పందించారు. అతడు సమంత కు లవ్యూ అని చెప్పేవాడు.. కానీ సమంత నాకు సోదరి వరుస అవుతుందని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయం నాగచైతన్యకు కూడా తెలుసని ఆయన చెప్పాడు. ఈ విడాకుల వ్యవహారంపై ప్రతీమ్ చేసిన పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. అతడు కాసేపటికే వాటిని డిలేట్ చేసేశాడు.
దీంతో సమంత-నాగ చైతన్యలు విడిపోవడానికి కారణం ఇతనేనంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఒక నిజాన్ని బయటపెట్టింది. సమంతకు పర్సనల్ స్టైలిస్ట్ గా ఉన్న ప్రీతమ్ జుకల్కర్ అస్సలు మగాడే కాదని.. అతడు ఒక గే అనే అనుమానం ఆమె వ్యక్తం చేసింది. ఇలాంటి వాడితో.. సమంతకు.. లింక్ ఎలా పెడతారు.. అలాంటి అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది. వారిద్దరు విడిపోవడానికి కారణం ఇదైతే కాదంటూ ఆమె స్పష్టం చేశారు. సమంత విడాకులు తీసుకొని తొందరపడిందని.. చిన్న స్థాయి నుంచి వచ్చిన సమంత.. డబ్బు అనే వ్యామోహం కోసం తన కెరీర్ ను నాశనం చేసుకుందని చెప్పుకొచ్చింది.
నాగ చైతన్య ఇచ్చిన ఫ్రీడమ్‌ని మిస్ యూజ్ చేసుకుంది. పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్లు కూడా పెళ్లి తర్వాత సినిమాలను చేయడం మానేశారు.. కానీ సమంత అలా కాకుండా తొందరపడిందేమో అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అయితే వారిద్దరిలో (సమంత, నాగచైతన్య) ఎవరికో ఒకరికి ఏదో సైడ్ యవ్వారాలు ఉండే ఉంటాయి.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పారు. అయితే ప్రీతమ్ తో మాత్రం ఎలాంటి అఫైర్ లేదనేది తన అభిప్రాయమంటూ చెప్పారు శ్రీరెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Entertainment News in Telugu, Latest Cineme news in telugu, Nagachaithanya, Samantha Ruth Prabhu, Srireddy, Telugu Cinema News, Telugu cineme videos, Telugu Movie News, Telugu movie ratings, Tollowood film news