Sri Reddy: క్లైమాక్స్‌‌కు చేరిన శ్రీరెడ్డి కహాని.. నెక్ట్స్ ఏమిటో..

సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా శ్రీరెడ్డి కహాని క్లైమాక్స్‌కు చేరింది.

news18-telugu
Updated: November 10, 2019, 9:45 PM IST
Sri Reddy: క్లైమాక్స్‌‌కు చేరిన శ్రీరెడ్డి కహాని.. నెక్ట్స్ ఏమిటో..
శ్రీరెడ్డి (Image: Sri Reddy/Facebook)
news18-telugu
Updated: November 10, 2019, 9:45 PM IST
సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది. తెలుగులో దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, హీరో నాని పై టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచింది. ఏ సినిమా అవకాశాల కోసం తనను వాడుకొని ఒదలేసారే.. అదే సినిమాల్లో ఆమె నటిగా అవకాశం దక్కించుకుంది. తాజాగా శ్రీరెడ్డి.. ‘క్లైమాక్స్’ అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీరెడ్డి తన నిజ జీవిత పాత్రనే పోషించడం విశేసం.  ‘డ్రీమ్‌` చిత్రంతో ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ ల్స్ లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

సౌత్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు.
శ్రీరెడ్డి (Facebook photo)


ఇందులో డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పృథ్వీరాజ్‌, శివ‌శంక‌ర్ మాస్ట‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు పాత్ర‌లు ప్ర‌ధానంగా ఉంటాయి. పాస్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వ‌ర్ రెడ్డి, కె.క‌రుణాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .మరోవైపు శ్రీరెడ్డి.. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో కూడా తన నిజ జీవిత పాత్రనే చేస్తున్నట్టు ప్రకటించింది.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...