ఆ హీరోతో పడక సుఖాన్ని పంచుకున్నాను.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Sri Reddy | శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతేకాదు తాజాగా టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తోంది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 27, 2019, 6:37 AM IST
ఆ హీరోతో పడక సుఖాన్ని పంచుకున్నాను.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
శ్రీరెడ్డి (File)
  • Share this:
శ్రీరెడ్డి... ఈ పేరు చెబితే చాలు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో చాలామందికి వెన్నులో వణుకుపుడుతుంది. ‘కాస్టింగ్ కౌచ్’ ఆరోపణలతో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న డైరెక్టర్ సి.సుందర్, మురగదాస్, రాఘవ లారెన్స్ వంటి వాళ్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి తమిళ తంబీల వెన్నులో వణుకు పుట్టించింది. అవకాశాలు ఇస్తామని నమ్మించి, తనను లైంగికంగా వాడుకున్నారని ఆరోపణలు చేసింది.

తర్వాత కనిపించకుండా పోయిన శ్రీరెడ్డి..తాజాగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాలో లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేస్తోంది. అంతేకాదు తాజాగా శ్రీరెడ్డి బ్యాక్ అంటూ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు తాజాగా టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తోంది.

అంతేకాదు ఆ హీరోను నేను చాలా నమ్మాను. అతను తన సినిమాలో హీరోయిన్‌గా లేకుంటే సహాయ నటి పాత్రలోనైనా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పాడు.  అంతేకాదు సదరు హీరోలకు డ్రగ్స్, స్మోకింగ్ సహా అన్ని దురలవాట్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇక అతను నన్ను  నమ్మించి ఎన్నో సార్లు  శారీరకంగా వాడుకున్నాడు. కానీ ఆ హీరో నన్ను వాడుకొని మోసం చేశాడని వాపోయింది. శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. ఇంతకీ శ్రీరెడ్డి చెప్పిన ఆ హీరో ఎవరు ? అతన పేరేంటి మాత్రం చెప్పకపోవడం కొసమెరుపు.

 

First published: February 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>