• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ACTRESS SRI REDDY FIRES ON TOLLYWOOD HEROES WHO NOT ATTENDED FOR SP BALASUBRAHMANYAM FUNERAL PK

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు.. ఎస్పీ బాలు అంత్యక్రియలకు రాకపోవడంపై శ్రీ రెడ్డి ఫైర్..

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు.. ఎస్పీ బాలు అంత్యక్రియలకు రాకపోవడంపై శ్రీ రెడ్డి ఫైర్..

ఎస్పీ బాలు శ్రీ రెడ్డి (sp balasubrahmanyam sri reddy)

Sri Reddy: శ్రీ రెడ్డి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగులో నానా రచ్చ చేసింది. ఏకంగా మా అసోసియేషన్ ముందు బట్టలిప్పి నడిరోడ్డుపై నానా హంగామా చేసింది.

  • Share this:
శ్రీ రెడ్డి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే క్యాస్టింగ్ కౌచ్ పేరుతో తెలుగులో నానా రచ్చ చేసింది. ఏకంగా మా అసోసియేషన్ ముందు బట్టలిప్పి నడిరోడ్డుపై నానా హంగామా చేసింది. ఆ తర్వాత ఎన్నో ఆరోపణలు.. ఎన్నో సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఓ దశలో శ్రీ రెడ్డిని చంపేస్తామంటూ నెటిజన్లతో పాటు చాలా మంది హీరోల అభిమానులు కూడా ఫైర్ అయ్యారు.. బెదిరించారు. ఓసారి దాడి కూడా జరిగింది. దాంతో వెంటనే చెన్నై వెళ్లిపోయింది శ్రీ రెడ్డి. అయితే ఈమె మాట్లాడిన దాంట్లో తప్పు లేదు.. కాకపోతే మాట్లాడే మాటలు మాత్రం కాస్త శృతి మించుతున్నాయంటూ కొందరు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌పై రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. మొన్నటికి మొన్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం వాడేసుకుంది ఈమె. ఇప్పుడు బాలు మరణంపై ఓ వీడియో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
ఎస్పీ బాలు శ్రీ రెడ్డి (sp balasubrahmanyam sri reddy)
ఎస్పీ బాలు శ్రీ రెడ్డి (sp balasubrahmanyam sri reddy)

ఇది చూసిన తర్వాత కొందరు ఫైర్ అవుతుంటే.. మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. లెజెండరీ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలు అంత్యక్రియలకు టాలీవుడ్ నుంచి ఎవ్వరూ హాజరు కాకపోవడంపై శ్రీ రెడ్డి పెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. చెన్నైలోనే ఉన్న శ్రీ రెడ్డి.. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు హాజరైంది. అయితే అక్కడ ఎవరూ తెలుగు వాళ్లు కనిపించకపోవడంతో ఈమె మండిపడింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి అక్కడికి రాకపోవడంపై ఆమె ఫైర్ అయింది.
ఎస్పీ బాలు శ్రీ రెడ్డి (sp balasubrahmanyam sri reddy)
ఎస్పీ బాలు శ్రీ రెడ్డి (sp balasubrahmanyam sri reddy)

అది చూసి తనకు చాలా బాధ కలిగించిందని.. మన సినీ పరిశ్రమను అక్కడి జనాలు చాలా తిట్టుకున్నారని చెప్పింది శ్రీ రెడ్డి. ఒక తెలుగు నటిగా తన పరువు పోయిందని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ విషయమై ఆమె టాలీవుడ్ ప్రముఖులను తీవ్ర స్థాయిలో తిట్టి పోసింది శ్రీ రెడ్డి. ఈమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఎస్పీ బాలు గారి మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా అంటూ దొంగ నాకాటలు ఆడటమే కాకుండా దొంగ కన్నీరు కార్చారంటూ శ్రీ రెడ్డి ఫైర్ అయింది.
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy hot)
శ్రీ రెడ్డి ఫైల్ ఫోటో (Sri Reddy)

అలా కన్నీరు కార్చారే కానీ తప్ప కడసారి చూపు కోసం రాలేదని.. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్‌లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరంటూ విరుచుకుపడింది. ఆయన గాత్రంతోనే వాళ్లను స్టార్స్‌ను చేసారని.. కానీ అలాంటి లెజెండ్ చనిపోతే ఒక్కరు కూడా కడసారి చూపులకు రాకపోవడం దారుణం అంటుంది శ్రీ రెడ్డి. అలాంటి నీచమైన ఇండస్ట్రీ ఇది అంటూ కోపం వెల్లగక్కింది. 'మా 'అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు.. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా అంటూ మండి పడింది.

ఆ బోడి గుండు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా.. మీ కొడుకులను, మేనల్లుళ్లను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంత పెద్ద గాన గంధర్వుడు పోతే వెళ్లడంలో లేదా అంటూ ప్రశ్నించింది శ్రీ రెడ్డి. ఒక్క నా కొడుకూ రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు అంటూ పరుష పదజాలం కూడా వాడింది. పెద్దపెద్ద వాళ్ల అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వాళ్లను చివరిచూపు చూడలేరా అంటూ రెచ్చిపోయింది. షేమ్ షేమ్.. చెన్నైలో తన పరువు పోయిందంటూ బాధ పడింది ఈ కాంట్రవర్సీ క్వీన్. తాను బాలు అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున.. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు నటిగా చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నా అంటూ వీడియో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి.
Published by:Praveen Kumar Vadla
First published: