మరోసారి నానిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. ‘జెర్సీ’ మూవీపై తనదైన శైలిలో సెటైర్లు..

నాని, శ్రీరెడ్డి

శ్రీరెడ్డి మరోసారి నాని టార్గెట్ చేసింది. అందరు ‘జెర్సీ’ సినిమాలో నాని నటనను మెచ్చుకుంటుంటే ఈమె మాత్రం ‘జెర్సీ’ లో నాని నటనపై తనదైన శైలిలో సెటైర్లు వేేసింది. వివరాల్లోకి వెళితే..

  • Share this:
శ్రీరెడ్డి మరోసారి నాని టార్గెట్ చేసింది. అందరు ‘జెర్సీ’ సినిమాలో నాని నటనను మెచ్చుకుంటుంటే ఈమె మాత్రం ‘జెర్సీ’ లో నాని నటనపై తనదైన శైలిలో సెటైర్లు వేేసింది. వివరాల్లోకి వెళితే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వీ బాదుడు బాదేస్తోంది . ఏప్రిల్ 19 న రిలీజైన ఈ సినిమాపై సినిమాపై  అన్ని ఏరియాల్లోంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీలోని ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రాజమౌళి  సహా పలువురు ప్రముఖులు  ఈసినిమాలో నాని నటనను మెచ్చుకున్నారు. ఈ సినిమాలో నాని రంజీ క్రికెటర్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఒక క్రికెటర్‌గా, లవర్‌గా, ఒక తండ్రిగా వివిధ రకాల భావేద్వేగాలను ఎంతో అద్బుతంగా పండించాడు. ఇప్పటికే ఈ సినిమా యూఎస్‌లో వన్ మిలియన్ డాలర్స్‌ను కొల్లగొట్టింంది. యూఎస్‌లో నానికి  ఇది ఆరో సినిమా. బీ,సీ సెంటర్స్‌లో ఓ మాదిరిగా ఆడుతున్న ఈ సినిమా ఏ సెంటర్స్‌తో పాటు మల్టిప్లెక్స్‌ల్లో ఓ రేంజ్‌లో ఇరగదీస్తోంది.

శ్రీరెడ్డి మరోసారి నాని టార్గెట్ చేసింది. అందరు ‘జెర్సీ’ సినిమాలో నాని నటనను మెచ్చుకుంటుంటే ఈమె మాత్రం ‘జెర్సీ’ లో నాని నటనపై తనదైన శైలిలో సెటైర్లు వేేసింది. వివరాల్లోకి వెళితే..
జెర్సీ పోస్టర్


తాజాగా ఈ సినిమాలో నాని యాక్టింగ్ ‌ను చూసి శ్రీరెడ్డి తనదైన శైలిలో పంచ్‌లు వేసింది. సినిమాలో చూపించినట్టు నాని మంచివాడని అనుకోవద్దు. అతనిలో తెలియని ఇంకోటి ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు నాని ‘జెర్సీ’ సినిమా హిట్టైయినందుకు ఏం కర్మరా బాబు అంటూ తన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక  శ్రీరెడ్డి తనను ఇంతలా టార్గెట్ చేస్తోన్న నాని మాత్రం మౌనమే పాటిస్తున్నాడు. ఇక శ్రీరెడ్డి చేసిన ఈ కామెంట్స్‌పై నాని అభిమానులు  ఓ రేంజ్‌లో  మండిపడుతున్నారు.
First published: