ACTRESS SRI REDDY AGAIN SENSATIONAL COMMENTS ON BIGG BOSS 3 TELUGU HOST KING NAGARJUNA HERE ARE THE DETAILS TA
Bigg Boss 3 | నాగార్జునపై మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ శ్రీ రెడ్డి ..
శ్రీరెడ్డి, నాగార్జున (File)
గత రెండు సీజన్స్ కంటే భిన్నంగా బిగ్‌బాస్ 3 తెలుగు ప్రసారాలకు ముందే వివాదాల్లో నిలిచింది. తాజాగా హేమ ఎలిమినేషన్ తర్వాత మరిన్ని చర్చలకు తావిస్తోంది. మరోవైపు శ్రీ రెడ్డి వరుస పోస్టులు బిగ్ బాస్ చర్చలను మరింత ముదిరేలా చేస్తున్నాయి.వివరాలలోకి వెళితే ..
గత రెండు సీజన్స్ కంటే భిన్నంగా బిగ్‌బాస్ 3 తెలుగు ప్రసారాలకు ముందే వివాదాల్లో నిలిచింది. తాజాగా హేమ ఎలిమినేషన్ తర్వాత మరిన్ని చర్చలకు తావిస్తోంది. ఇక బిగ్‌బాస్ 3 మొదటి వారం పూర్తైయిందో లేదో హేమాను హౌస్ లోంచి పంపించేసారు. ఆమె ప్లేస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హేమ చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు శ్రీ రెడ్డి వరుస పోస్టులు బిగ్ బాస్ చర్చలను మరింత ముదిరేలా చేస్తున్నాయి.వివరాలలోకి వెళితే .. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తనదైన శైలిలో పోరాడుతోంది శ్రీరెడ్డి. టాలీవుడ్లో అవకాశాల పేరుతో లొంగదీసుకుని తెలుగు అమ్మాయిలకు అన్యాయం చేస్తున్నారంటూ శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే కదా.
బిగ్ బాస్ 3 (ఫైల్ చిత్రం)
బిగ్ బాస్ 3 ప్రారంభంలో బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక ఆరోపణలు చేసిన శ్వేతా రెడ్డికి మద్దతు పలికింది శ్రీ రెడ్డి. '' నాకు తమిళ బిగ్ బాస్ బాగా నచ్చింది శ్వేతా రెడ్డి గారూ.. మీ దెబ్బకి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అట్టర్ ఫ్లాప్.. నా సపోర్ట్ మీకే శ్వేతా రెడ్డి అంటూ మద్దతు ప్రకటించిన శ్రీరెడ్డి. తాజాగా నాగార్జునపై మరోసారి వివాదస్పద కామెంట్స్ చేసింది. ‘నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ' అంటూ ఫేస్బుక్లో గతంలోనే ఒక పోస్ట్ చేసింది. దీనికి కొనసాగింపుగా తొలివారం హేమ ఎలిమినేషన్ జరిగాక, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే అదునుగా చేసుకొని నాగార్జునను ఉద్దేశిస్తూ మరో పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి. తమన్నాకి బిగ్‌బాస్ రూపంలో నాగార్జున అనే పెద్ద బాయ్య దొరికాడంటూ పెద్ద కామెంట్సే చేసింది. మొత్తానికి బిగ్‌బాస్ రూపంలో నాగార్జునను ఓ రేంజ్లో ఏకి పారేస్తుంది శ్రీరెడ్డి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.