హోమ్ /వార్తలు /సినిమా /

బేబీ బంప్‌తో హీరోయిన్ డాన్స్.. అయితే ఆమె ప్రెగ్నెంట్ కాదంట!

బేబీ బంప్‌తో హీరోయిన్ డాన్స్.. అయితే ఆమె ప్రెగ్నెంట్ కాదంట!

బేబీ బంప్‌తో హీరోయిన్ డాన్స్

బేబీ బంప్‌తో హీరోయిన్ డాన్స్

గత ఏడాది శ్రీయ పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి శ్రీయ బేబీ బంప్‌తో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఒకప్పుడు పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు ఏవీ.. బయటకు రాకుండా జాగ్రత్త పడే.. సెలబ్రిటీలు.. ఇప్పుడు అన్నీ విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.పెళ్లి, ప్రేమ, బ్రేకప్..డైవర్స్ ఇలా మ్యాటర్ ఏదైనా... తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేస్తున్నారు. హీరోయిన్ల విషయానికి వస్తే.. ఒకప్పుడు పెళ్లి చేసుకున్న భామలు.. ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా దాచిపెట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్‌తో సహా,స్కానింగ్, బేబి బంప్ ఇలా అన్ని ఫోటోలను ఫ్యాన్స్‌కు షేర్ చేస్తున్నారు. తాజాగా.. హీరోయిన్ శ్రీయ తన బేబి బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

నిన్న మొన్నటివరకూ బేబీ బంప్‌తో నెట్టింట్లో రచ్చ చేసిన కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అదే తరహాలో మరో హీరోయిన్ శ్రియా సరన్ కూడా బేబీ బంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఆ వీడియో ఇప్పటిది కానే కాదు. అది పాత వీడియో.. 2020లో బేబీ బంప్‌తో డ్యాన్స్ చేసిన వీడియో అది.. మొదటి లాక్ డౌన్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని తన అభిమానులకు షేర్ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో శ్రీయకు కూతురు పుట్టింది. ఆ విషయాన్ని ప్రకటించి సడన్ షాక్ ఇచ్చింది శ్రియా. 2018లో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చవ్‌ను సీక్రెట్ గా పెళ్లాడింది. ప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. తాను ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తన రొమాంటిక్ ఫొటోలను ఎప్పటికప్పుడూ తన ఇన్ స్టాలో పోస్టు చేస్తుంది

శ్రీయ ఇష్టం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నువ్వె నువ్వె సినిమాతో తరుణ్‌కు జంటగా నటించింది.ఆ సినిమా హిట్‌తో శ్రీయ వరుసగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో నటించింది. టాప్ హీరోయిన్ గా ఎదిగింది. టాలీవుడ్ బడా హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు,విక్టరీ వెంకటేష్, ప్రభాస్, తరుణ్, ఇలా చాలామంది అగ్రహీరోలతో శ్రియ నటించింది. బాలయ్య బాబుతో అప్పట్లో చిన్నకేశవ రెడ్డితో మంచి హిట్ జోడీగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణిలో శ్రియా నటించింది. పెళ్లి అయిన తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన శ్రియా.. ఇటీవల రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీలోనూ కనిపించింది.

First published:

Tags: Shriya Saran, Tollywood

ఉత్తమ కథలు